E-Service Centre: ఇక ప్రైవేటు ఈ-సేవా కేంద్రాలు.. మొత్తం ఎన్నంటే...
ABN, First Publish Date - 2023-05-16T11:05:55+05:30
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఈ-సేవా కేంద్రాలు(Private e-service centers) ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐసిఎఫ్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా 15,500 ప్రైవేటు ఈ-సేవా కేంద్రాలు(Private e-service centers) ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ సేవలు సులభతరం చేసేలా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ప్రైవేటు ఈ-సేవా కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇంటర్నెట్ కేంద్రాల్లో ఈ-సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు 15,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాల అడ్మిషన్లు ప్రారంభం కావడంతో విద్యార్థులకు అవసరమైన సర్టిఫికేట్లు అందించేలా ఈ నెలాఖరు నుంచి ప్రైవేటు ఈ-సేవా కేంద్రాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Updated Date - 2023-05-16T11:05:55+05:30 IST