కఠిన హృదయాలను కూడా కరిగించే ఘటన.. తల్లిని బ్రతికించుకోవాలని ఐదేళ్ల బుడ్డోడి ఆరాటం.. చివరకు ఏమైందంటే..
ABN, First Publish Date - 2023-02-22T21:29:32+05:30
ఐదేళ్ల వయసులో చాలా మంది పిల్లలకు ఆడుకోవడం తప్ప మరేమీ తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం పెద్దలు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. అంత చిన్న వయసులో కూడా సాటి మనుషుల పట్ల మానవత్వం ప్రదర్శించి, అందరి మెప్పూ పొందుతుంటారు. ఇంకొందరు పిల్లలు..
ఐదేళ్ల వయసులో చాలా మంది పిల్లలకు ఆడుకోవడం తప్ప మరేమీ తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం పెద్దలు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. అంత చిన్న వయసులో కూడా సాటి మనుషుల పట్ల మానవత్వం ప్రదర్శించి, అందరి మెప్పూ పొందుతుంటారు. ఇంకొందరు పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలను కనబరుస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ బుడ్డోడి గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఉన్నట్టుండి అపస్మారక స్థితికి చేరుకున్న తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని.. ఐదేళ్ల కొడుకు చేసిన ప్రయత్నాన్ని చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రూర్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ (woman) తన అబిద్ అనే ఐదేళ్ల కొడుకుతో (Five year old son) కలిసి భిక్షాటన చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఆమె ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై.. అపస్మారక స్థితికి (unconsciousness) చేరుకుంది. తల్లి స్పృహ లేకుండా పడిపోవడాన్ని గుర్తించిన ఐదేళ్ల కొడుకు వెంటనే అప్రమత్తం అయ్యాడు. తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని వీల్ చైర్‌లో పడిపోయిన ఆమెను తోసుకుంటూ వెళ్లాడు. రద్దీగా ఉన్న రోడ్డులో చిన్నారి ఇలా తల్లిని తోసుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి (Reporter) గమనించి బాలుడిని ప్రశ్నించాడు. జరిగిన విషయం తెలుసుకుని, వెంటనే తన స్నేహితుడి సాయంతో ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి (Hospital) తరలించారు. సమయానికి తీసుకురావడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. కాగా, వీల్ చైర్‌లో ఉన్న తల్లిని తోసుకుంటూ వెళ్తున్న బాలుడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవుతున్నాయి. దీంతో బాలుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - 2023-02-22T21:30:35+05:30 IST