Viral Video: గోనె సంచులతో ప్యాంటులు.. ధరెంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-02-18T17:50:47+05:30
ఓ ప్యాంట్ క్లాత్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దాని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.
వస్త్రాలు.. మనిషికి ఎంతో అవసరం. అలాగే ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు, మోడల్స్ నిత్యం చూస్తుంటాం. ఆడవాళ్ల బట్టలు వేరుగా ఉంటాయి. మగవాళ్ల దుస్తులు వేరుగా ఉంటాయి.. కాకపోతే ఒక్కో దేశంలో ఒక్కోలా ధరిస్తుంటారు. జెంట్స్ అయితే ప్యాంట్, షర్టు కామన్‌గా ధరిస్తుంటారు. వీటిలో కాటన్, జీన్స్, పాలిస్టర్ ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఇదంతా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ ప్యాంట్ క్లాత్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దాని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.
గోనె సంచుల గురించి మనకు బాగా తెలుసు. వాటిని ఎక్కువగా కూరగాయాలు, మిరపకాయలు, తృణధాన్యాలు, బియ్యం, వగేరా వస్తువులను నిల్వచేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇంతవరకే మనకు తెలుసు. కానీ దాన్ని ఉపయోగించి తయారు చేసిన ఓ ప్యాంట్ ఇంటర్నెట్ (Internet post)ను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం రకరకాలైన సంచులు రావడంతో గోనె సంచులు అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడెక్కువగా ప్లాస్టిక్ సంచుల్నే ఉపయోగిస్తున్నారు. కాబట్టి నేటి తరానికి అంత పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడో సారి ప్లాష్ బ్లాక్ వెళ్లే సీన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా (Social media) పుణ్యమా అంటూ ఆ పాత సంగతిని జ్ఞాపకం చేసుకొనే అవకాశం వచ్చింది. ఇప్పుడా వార్త వైరల్ (Viral Video)గా మారింది.
ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!
జూట్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ప్యాంట్‌ను దుకాణదారుడు షోరూమ్ (Showroom)లో ప్రదర్శించాడు. ఇదేంటో విచిత్రంగా ఉందంటూ కొనుగోలుదారులు దగ్గర కెళ్లి మరీ పరిశీలించి స్టన్ అయ్యారు. అదేదో ఆకాశం నుంచి దిగొచ్చిన క్లాత్‌తో కుట్టించారనుకుంటే అది కాదు. మన కళ్ల ముందు అప్పడప్పుడు కనబడే గోనె సంచె. దాన్ని ప్యాంట్‌గా కుట్టి షోరూమ్‌లో పెట్టాడు. సరే అంత వరకు బాగానే ఉంది. తీరా కొందామనుకున్నవాళ్లు మాత్రం షాక్ అయ్యారు. దాని ధరెంతో చూసి అమ్మో అంటో గుండెలు బాదుకున్నారు. దాని ధరెంతో తెలుసా. అక్షరాలు రూ.60,000. సోషల్ మీడియాలో "సచ్కద్వాహై" "Sachkadwahai" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షోరూమ్ పేరుతో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో చాలా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు దీనికి 5 లక్షల మంది కంటే ఎక్కువగా లైక్ చేశారు. అంతమాత్రమే కాదు పలు సెటైర్లు, వ్యంగ్యస్త్రాలు నెటిజన్లు సంధించారు. ఇంకొందరైతే నవ్వుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. పొరపాటున ప్యాంట్ నేల మీద పడితే.. కాళ్లు తుడుచుకునే ప్రమాదం ఉందంటూ ఒకరు. ఇదే నిజమైన రీసైక్లింగ్ అంటూ మరొకరు కామెంట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..
Updated Date - 2023-02-18T17:53:28+05:30 IST