Viral Video: ఓ డబ్బాలో పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకొచ్చాడో యువకుడు.. అసలు విషయం తెలిసి అవాక్కైన డాక్టర్లు..!
ABN, First Publish Date - 2023-02-23T12:52:39+05:30
బిహార్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ డబ్బాలో పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకొచ్చాడో యువకుడు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ డబ్బాలో పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకొచ్చాడో యువకుడు. అది చూసిన వైద్యులకు మొదట ఏం అర్థం కాలేదు. కానీ, ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. బిహార్ రాష్ట్రంలోని చాప్రా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ యువతి తన ఇంట్లో వంట చేస్తుంది. అది కూడా కట్టేల పోయ్యి మీద కావడంతో పక్కనే కట్టేల మోపు పెట్టుకుంది. ఆ కట్టేల మోపులోనే ఓ పాము ఉంది. ఆ మోపు నుంచి కట్టేలు తీస్తున్న సమయంలో అందులోని పాము ఆ యువతిని కాటేసింది. వెంటనే ఈ విషయం ఆ యువతి ఇంట్లోవారికి చెప్పింది. దాంతో ఆ కుటుంబం అప్రమత్తమైంది.
వెంటనే యువతి సోదరుడు ఆమెకు కాటేసిన పామును చంపి ఓ డబ్బాలో వేసుకున్నాడు. ఆ తర్వాత యువతితో పాటు ఆ పామును కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇక యువకుడి చేతిలో పామును చూసిన వైద్యులు మొదట ఏమైందని అడిగారు. అనంతరం అతడు చెప్పిన అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే యువతికి చికిత్స అందించారు. ఆ తర్వాత యువకుడి చర్యను మెచ్చుకున్నారు. తన సోదరికి ఏ పాము కరిచిందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందనే తాను ఆ సర్పాన్ని కూడా ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెప్పడంతో వైద్యులు అతడి సమయస్ఫూర్తిని ప్రశంసించారు. యువకుడి చర్య వల్ల కాటేసిన పాము విషపూరితమైనదా కాదా అనేది తెలుసుకోవడం సులువైందని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే పాము విషయానికి విరుగుడు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యం అమెరికాలో కలకలం.. 'జాంబీలు'గా మార్చేస్తున్న కొత్త డ్రగ్..!
Updated Date - 2023-02-23T12:52:42+05:30 IST