ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OMG!: 'చారానా కోడికి బారానా మసాలా'.. అంటే ఇదేనేమో!

ABN, First Publish Date - 2023-02-17T09:30:47+05:30

కొందరు ఎంత ఇష్టంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారో.. అంతే ఇష్టం దానికి నంబర్ ప్లేట్ అమర్చే విషయంలో చూపిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: కొందరు ఎంత ఇష్టంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారో.. అంతే ఇష్టం దానికి నంబర్ ప్లేట్ అమర్చే విషయంలో చూపిస్తుంటారు. అందరికంటే భిన్నంగా చూడగానే వాటిపై ఉండే అంకెలు ఆకర్షించేలా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ (Fancy Registration Number) పెడుతుంటారు. ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంతటి వ్యయానికైన వెనకాడరు. ఇంకా చెప్పాలంటే వెహికల్ కొనేందుకు అయిన ఖర్చు కంటే కూడా ఫ్యాన్సీ, వీఐపీ, వీవీఐపీ నంబర్ల కోసం పెడుతుంటారు. ఇలాంటి సంఘటనల గురించి మనం ఇప్పటివరకు చాలానే విని ఉన్నాం కూడా. ఇదే కోవలో తాజాగా ఓ సంఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లాలో జరిగింది. ఓ వానహనదారుడు తన స్కూటీ కోసం తీసుకున్న ఫ్యాన్సీ నంబర్ తాలూకు వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

రూ.1లక్ష పెట్టి తాను కొత్తగా కొన్న స్కూటీ (Scooty) కోసం ఓ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకునేందుకు ఏకంగా రూ.1కోటికి పైగా చెల్లించేందుకు రెడీ అయ్యాడు. మరో 26 మందితో పోటీపడి మరీ దాన్ని దక్కించుకునేందుకు మనోడు సిద్ధంగా ఉన్నాడు. సిమ్లా కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ నంబర్ కోసం ఇలా భారీ బిడ్ వేశాడు. ఇంతకీ ఆ ఫ్యాన్సీ నంబర్ (Fancy Number) ఏదో చెప్పలేదు కదూ. HP999999. దీనికోసం మనోడు ఏకంగా రూ.1కోటి 11వేలు బడ్డింగ్ వేశాడు. వాస్తవానికి దీని రిజర్వ్ ధరను రవాణాశాఖ అధికారులు రూ.1000గా ఫిక్స్ చేశారు. అయితే, ఈ వీవీఐపీ నంబర్ కోసం ఏకంగా 26 మంది ఆసక్తి చూపడంతో కాంపిటేషన్ పెరిగింది. చివరకు బిడ్ రూ.కోటి11వేలకు చేరింది. శుక్రవారం వరకు బిడ్‌కు అవకాశం ఉండడంతో ఇంకా ఇది పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు అన్నారు. చివరకు ఎక్కువ బిడ్ వేసిన వారికి ఆ ఫ్యాన్సీ నెంబర్ కేటాయించడం జరుగుతుందని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అన్నారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'చారానా కోడికి బారానా మసాలా' అంటే ఇదేనేమో.. అని చమత్కరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టెర్రస్‌పై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-02-17T10:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising