ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వావ్.. ఏం ఐడియా గురూ.. పంటను రక్షించుకునేందుకు ఈ రైతన్న వెరైటీ టెక్నిక్.. చూస్తే శభాష్ అనాల్సిందే..!

ABN, First Publish Date - 2023-11-06T16:36:31+05:30

పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో భారతీయులు సిద్ధహస్తులు. ముఖ్యంగా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అద్భుతమైన ప్లాన్‌లు వేస్తుంటారు. పశువుల నుంచి, పక్షుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు వేస్తుంటారు.

పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో భారతీయులు సిద్ధహస్తులు. ముఖ్యంగా రైతులు (Farmers) తమ పంటను కాపాడుకునేందుకు అద్భుతమైన ప్లాన్‌లు వేస్తుంటారు. పశువుల నుంచి, పక్షుల నుంచి తమ పంటను (Crop) రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు (Ideas) వేస్తుంటారు. తాజాగా ఓ రైతు తన మొక్కజొన్న పంటను (Maize crop) కాపాడుకునేందుకు బాటిల్స్‌ను ఉపయోగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఆ రైతుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సాధారణంగా మొక్కజొన్న పంటకు పక్షుల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. మొక్కజొన్న కంకెలు రాగానే పక్షులు వాటిని తినేస్తుంటాయి. అలాంటిది జరగకుండా ఉండేందుకు ఓ రైతు వెరైటీ ప్లాన్ వేశాడు. తన పొలంలోని మొక్కజొన్న కంకెలకు ప్లాస్టిక్ బాటిళ్లను (Bottles) రక్షణగా ఏర్పాటు చేశాడు. మొక్కజొన్న కంకెలను ప్లాస్టిక్ బాటిళ్లలోకి దింపాడు. అలా చాలా బాటిళ్లను ఉపయోగించాడు. దీని వల్ల మొక్కజొన్న పంటను ఏ పక్షీ తినదు. అలాగే పంటను కాపాడుకోవడానికి రైతు పగలు రాత్రి పొలాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు.

Viral News: శభాష్ కుమారీ.. భర్త కండక్టర్‌గా పనిచేస్తున్న బస్సులోనే డ్రైవర్‌గా ప్రతిరోజూ డ్యూటీ.. అసలు వీళ్లిద్దరి కథేంటంటే..!

@rk_khan_facts అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Jugaad Video) షేర్ అయింది. ఈ వీడియోను 15 లక్షల మందికి పైగా వీక్షించారు. 34 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ ఐడియాను కొద్ది మంది ప్రశంసిస్తుంటే.. చాలా మంది వ్యతిరేకిస్తూ కామెంట్లు చేశారు. ``ఇది తెలివితక్కువ పని.. ఐదెకరాల్లో మొక్కజొన్న వేస్తే అన్ని బాటిళ్లు ఎలా వస్తాయి``, ``ప్లాస్టిక్ కాలుష్యం తప్ప ఉపయోగం లేదు``, ``బాటిల్‌లో పెడితే మొక్కజొన్న ఎలా పెరుగుతుంది``, ``ఇది మంచి ఆలోచన కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-06T16:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising