ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farting: నలుగురిలోకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేంతగా గ్యాస్ సమస్య ఉంటోందా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..

ABN, First Publish Date - 2023-05-12T11:41:46+05:30

నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురి మధ్యన తింటున్నప్పుడు ఊహించని విధంగా వచ్చే గ్యాస్ వల్ల ఎదుటివారు కూడా ఇబ్బంది పడుతూంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్యాస్ పోవడం అనేది చాలా సాధారణ విషయం. కానీ కొందరికి దీని వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురి మధ్యన తింటున్నప్పుడు ఊహించని విధంగా గ్యాస్ వచ్చేస్తుంది. ఈ గ్యాస్ ను నలుగురి మధ్య వదలాలంటే చాలా షేమ్ గా ఉంటుంది. వదలకపోతే కడుపంతా ఉబ్బరంగా ఉంటుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి సౌండ్ లేకుండా గ్యాస్ వెళ్ళిపోతుంది, కానీ చాలా వాసన వేస్తుంది. బాబోయ్ ఇక్కడినుండి పారిపోవాలి అనేట్టుగా చుట్టుప్రక్కల వారు ప్రవర్తిస్తుంటారు. అదే విపరీతమైన సౌండ్ వస్తే పైకే తెలిసిపోతుంది. దీనివల్ల చాలా సెటైర్లు వేస్తూ నవ్వుతూ ఉంటారు. ఏ విధంగా చూసినా అతిగా గ్యాస్ పోవడం అనేది ఇబ్బందికరమైన సమస్యే.. శరీరంలో వాతం పెరగడం వల్ల ఇలా అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే సమస్య కంట్రోల్ అవుతుంది.

'అధో వాత' అని పిలిచే ఈ అపానవాయువు(farting) తుమ్మడం(sneezing), దగ్గడం(coughing), ఆవళింతలు(yawns) వంటి అసంకల్పిత చర్యల్లాంటిదే(involuntary actions). గ్యాస్ వస్తున్నప్పుడు నలుగురిలో ఉన్నామని దాన్ని బయటకు వదలడానికి ఇబ్బంది పడి కంట్రోల్ చేసుకుంటే అది శరీరంలో అనేక వాత సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఉన్న వాతం(gout) తగ్గడానికి వెచ్చగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తేలికగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. చల్లగా ఉన్నవి, పచ్చిగా ఉన్నవి, పొడిగా, గట్టిగా( avoid cool, raw, dried, hard foods) ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. దీనివల్ల

ప్రతి రోజూ భోజనం చేసేటప్పుడు చిటికెడు వాము పొడిని(Ajwain powder) అన్నంలో వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కనీసం ఒక ముద్ద అయినా తినాలి. వాము అన్నంతో భోజనం ప్రారంభించాలి. దీనివల్ల వాతం తగ్గుతుంది.

Viral Video: నీళ్ళోలో మాటు వేసిన మొసలి.. ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతున్న జింక.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..


గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండురోజుల పాటు భారీ ఆహారాన్ని వదిలిపెట్టాలి. శొంఠి పొడి(dry ginger powder), బియ్యం పిండి(rice flour), బియ్యం నూక(rice rava), గోధుమ నూక(wheat rava), ఓట్స్(oats) వంటి పదార్థాలతో తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

కందిపప్పు(Toor dal) వంటి వంటింటి పప్పులు వాడుకునే ముందు వాటిని ముందుగా నీటిలో నానబెట్టి ఆ తరువాతే వండుకోవాలి. వంటల తయారీలో కూడా ఇంగువ(Asafoetida), జీలకర్ర(cumin) బాగా ఉపయోగించాలి. వీటివల్ల శరీరంలో వాతం శాంతించి గ్యాస్ సమస్య కంట్రోల్ అవుతుంది.

మరీ ముఖ్యంగా చాలామంది వేళకు ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. ఆహారం విషయంలో సమయపాలన మైంటైన్ చేస్తూ పై చిట్కాలు పాటిస్తే అంతా చక్కబడుతుంది.

Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..


Updated Date - 2023-05-12T17:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising