ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: సెకెండ్ హ్యాండ్ సైకిల్ కొని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి.. దానిని చూసిన కొడుకు ఏం చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-09-24T14:18:11+05:30

చిన్న చిన్న ఆనందాలే మనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా చిన్న విషయాలకు ఎంతగానో ఆనంద పడుతుంటారు. వారి సంతోషం చూసి తల్లిదండ్రులు మరింత సంబరపడుతుంటారు. పేద అయినా, ధనికుడు అయినా పిల్లల సంతోషం చూసి ఆనందించని తండ్రి ఉండడు.

చిన్న చిన్న ఆనందాలే మనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా చిన్న విషయాలకు ఎంతగానో ఆనంద పడుతుంటారు. వారి సంతోషం చూసి తల్లిదండ్రులు మరింత సంబరపడుతుంటారు. పేద అయినా, ధనికుడు అయినా పిల్లల సంతోషం చూసి ఆనందించని తండ్రి (Father) ఉండడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఎమోషనల్ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. సెకెండ్ హ్యాండ్ సైకిల్ (Second hand bicycle) కొన్నందుకు ఆ తండ్రీ కొడుకులు ఎంతో సంతోషపడుతున్నారో చూస్తే సంతృప్తి అంటే ఎంటో తెలుస్తుంది (Emotional Video).

IAS అధికారి అవనీష్ శరణ్ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాక ఇంటి ముందు ఓ వ్యక్తి సెకెండ్ హ్యాండ్ సైకిల్ పెట్టి పూజ చేస్తున్నాడు. అక్కడ ఆ వ్యక్తి కొడుకు కూడా ఉన్నాడు. ఆ సైకిల్ చూసి ఆ చిన్నారి సంతోషంతో గెంతులు వేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి, కొడుకు కలిసి ఆ సైకిల్‌కు దండం పెట్టుకున్నారు. ``అది కేవలం ఓ సెకెండ్ హ్యాండ్ సైకిల్. కానీ, వారి మొహాల్లో సంతోషం చూడండి. వారి ఆనందం చూస్తుంటే వారు కొన్నది బెంజ్ కార్ ఏమో అనిపిస్తోంద`` అని శరణ్ కామెంట్ చేశారు.

Success Story: 10 ఏళ్ల వయసుకే పెళ్లి.. చేతిలో 2 రూపాయలు లేక ఇబ్బందులు పడిన ఈమే.. ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 85 వేల మందికి పైగా లైక్ చేశారు. 3 వేల మందికి పైగా ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ మొత్తం ప్రపంచంలోని డబ్బు అంతా కలిపినా కూడా ఈ ఆనందాన్ని కొనుగోలు చేయలేకపోవచ్చు``, ``సంతోషానికి ధర లేదు సార్``, ``నిజమైన సంతృప్తి అంటే అదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-24T14:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising