Viral: బాస్ కొంపముంచిన కొలీగ్ మెసేజ్.. నేను గర్భవతినంటూ ఓ ఉద్యోగి నుంచి భర్తకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను ఆ భార్య చదివి..
ABN, First Publish Date - 2023-07-25T18:00:29+05:30
ప్రస్తుతం ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి సెలవు కావాలంటూ చేసిన మెసేజ్ ఆ బాస్ కొంప ముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్యకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.
ప్రస్తుతం ఓ వాట్సాప్ చాట్ (Whatsapp Chat) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి సెలవు (Leave)కావాలంటూ చేసిన మెసేజ్ ఆ బాస్ కొంప ముంచింది. మహిళా ఉద్యోగి (Female employee) పంపించిన మెసేజ్ చదివిన భార్య (Wife)కు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ (Boss) తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ ట్వీట్ ఏకంగా 3 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. internet hall of fame అనే ట్విటర్ హ్యాండిల్లో ఆ ఫొటో పోస్ట్ అయింది.
ఓ మహిళ తన బాస్‌కు లీవ్ కోసం వాట్సాప్ ద్వారా అప్లయ్ చేసింది. ముందుగా ఆ ఉద్యోగి తన బాస్‌కు ``హాయ్`` అని పంపించింది. ఆ తర్వాత ``నేను గర్భవతిని`` (Pregnant) అని మెసేజ్ చేసింది. దాంతో బాస్ షాకయ్యాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగి వరుసగా ``నాకు వరుసగా కొన్ని రోజులు లీవ్ కావాలి, నా గర్భం గురించి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాలి. దయచేసి సెలవు మంజూరు చేయండి`` అని మెసేజ్‌లు చేసింది. ఆ మెసేజ్‌కు బాస్ స్పందిస్తూ.. ``మొదట ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడాలి. ఆమె కేవలం తొలి రెండు మెసేజ్‌లు మాత్రమే చదివింది`` అని మెసేజ్ చేశాడు.
Monkey Video: పాపం.. ఈ కోతులకు ఎంత దప్పిక వేసిందో.. ఈ యువకుడి చేతిలో బాటిల్ చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి..!
ఆ తర్వాత ``ఈ మొత్తం విషయాన్ని అంతా ఒకే మెసేజ్‌లో పంపించవచ్చు కదా`` అని అడిగాడు. ఈ ఛాట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది. ఇప్పటివరకు ఈ ట్వీట్‌ను 3.5 కోట్ల మంది వీక్షించారు. 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు. ``పాపం.. ఆ బాస్ పరిస్థితి ఏమైందో``, ``వెరీ ఫన్నీ`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-25T18:00:29+05:30 IST