ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: కలికాలం అంటే ఇదేనేమో.. బాయ్‌ఫ్రెండ్ కోసం అమ్మాయిల గొడవ.. చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2023-03-19T20:35:21+05:30

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా పాఠశాలలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఒక అబ్బాయి కోసం కొట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సింగ్రౌలీ జిల్లా పాఠశాలలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఒక అబ్బాయి (Boy Friend) కోసం కొట్టుకున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలకు మరికొందరు మద్దతుగా వచ్చి గొడవకు దిగారు. ఆ గొడవలో ఒకమ్మాయి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో జాయిన్ అయింది. హాస్పిటల్‌లో ఉన్న అమ్మాయిని చంపేందుకు మరో యువతి కత్తి పట్టుకువెళ్లడం మరింత విస్మయం కలిగిస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Strange News).

సింగ్రౌలీ జిల్లాలోని నవనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినుల మధ్య శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఇదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రియుడి విషయంలో ఇద్దరు బాలికల మధ్య వాగ్వాదం మొదలైంది. వివాదం బాగా పెరిగి ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు (Girls fight for boy Friend). తర్వాత వారికి మరో ముగ్గురు జత కలిశారు. ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. కొంత సేపటి తర్వాత ఇద్దరు బాలికలు హాస్పిటల్‌కు చేరుకుని గాయపడిన బాలికను చంపేందుకు కత్తి కూడా పట్టుకెళ్లారు. హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని బయటకు గెంటేశారు.

నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది.. ఒక్క అమ్మాయి మొత్తం మార్చేసింది.. అంటూ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే షాక్

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తరచుగా మాట్లాడుతోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న బాలికపై ఆ బాలిక కోపం పెంచుకుంది. మాట్లాడొద్దని గతంలో వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా ఆమె తీరు మారకపోవడంతో గొడవకు దిగింది. తన స్నేహితులతో కలిసి కొట్టింది. ఆమెను చంపాలని కూడా నిర్ణయించుకుంది. పాఠశాల ఆవరణలో ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన విషయం వెలుగులోకి రావడంతో జిల్లా విద్యాశాఖ స్పందించింది. మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించింది.

వైద్యం పేరుతో అమాయక యువతికి వల.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ శునకానందం.. చివరకు ఎంత పని చేశాడంటే..

Updated Date - 2023-03-19T20:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising