Viral Video: ఓ యువకుడి గల్లా పట్టుకుని.. అందరి ముందు చెంపలు వాయించిన యువతి.. ఓ పోస్టర్‌ను చించాడని..
ABN, First Publish Date - 2023-09-25T19:53:26+05:30
తప్పిపోయిన కుక్క పోస్టర్‌ను తొలగించినందుకు ఓ మహిళ చాలా ఆగ్రహంగా స్పందించింది. ఏకంగా హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌ను అందరి ముందూ కొట్టింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది.
తప్పిపోయిన కుక్క (Dog Missing) పోస్టర్‌ను తొలగించినందుకు ఓ మహిళ చాలా ఆగ్రహంగా స్పందించింది. ఏకంగా హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌ను అందరి ముందూ కొట్టింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో ఈ ఘటన జరిగింది. నోయిడాలోని సెక్టార్ 75లో ఉన్న ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో ఆషి సింగ్ అనే మహిళ నివసిస్తోంది. ఇటీవల ఆమె పెంపుడు కుక్క తప్పిపోయింది. దీంతో ఆమె తన కుక్క మిస్సింగ్ పోస్టర్ (Dog missing poster)ను ఆ సొసైటీ ప్రాంగణంలో అంటించింది.
ఆ పోస్టర్‌ను ఆ సొసైటీ అధ్యక్షుడు నవీన్ మిశ్రా తొలగించాడు. దీంతో అషి సింగ్ రెచ్చిపోయింది. ఆ పోస్టర్‌ను నవీన్ తొలగించినట్టు తెలుసుకుని అతడిని నిలదీసింది. ఏకంగా అతడి కాలర్ పట్టుకుని దాడికి దిగింది. కాలర్ వదలాలని, మర్యాదగా మాట్లాడాలని నవీన్ సూచిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. అతడి మాటలకు మరింత రెచ్చిపోయి నవీన్ జుట్టు పట్టుకుని అందరి ముందు చెంపలు వాయించింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని ఆమెను వారించారు.
Viral News: 5 ఏళ్ల క్రితం పెళ్లి కాకముందు నా భర్త పంపిన మెసేజ్ ఇదేనంటూ ఓ భార్య బయటపెట్టిన సీక్రెట్.. నెట్టింట బిగ్ డిబేట్..!
ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొసైటీ ప్రెసిడెంట్ నవీన్ మిశ్రా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకే కొట్టినట్టు అషి సింగ్ పేర్కొంటోంది. కాగా, నవీన్ మిశ్రా బీజేపీ నాయకుడు కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-09-25T19:53:26+05:30 IST