ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fingernails: గోర్ల మాటున దాగి ఉండే ఆరోగ్య రహస్యాలు.. గోర్లు వాటంతట అవే విరిగిపోతూ ఉంటే అర్థమేంటంటే..!

ABN, First Publish Date - 2023-09-27T14:25:56+05:30

ప్రతి ఒక్కరిలో గోర్ల విషయంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. గోర్లు పసుపు రంగులో ఉండటం, పెళుసుగా మారి వాటంతట అవే విరిగిపోవడం, గోర్ల మీద మచ్చలు, గీతలు ఇలా ప్రతి ఒక్కటీ ఒక్కో అనారోగ్య సమస్యను సూచిస్తుంది.

'గోరంత ఆరోగ్యం కొండంత ప్రశాంతత ..' అంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటే శరీరం పూర్తీగా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. శరీరంలో ఏ అవయంలో ఏ సమస్య ఉందనేది గోర్ల కండీషన్ ను బట్టి చెప్పేయవచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో గోర్ల విషయంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. గోర్లు పసుపు రంగులో ఉండటం, పెళుసుగా మారి వాటంతట అవే విరిగిపోవడం, గోర్ల మీద మచ్చలు, గీతలు ఇలా ప్రతి ఒక్కటీ ఒక్కో అనారోగ్య సమస్యను సూచిస్తుంది. గోర్ల కండీషన్ వెనుక ఉన్న అనారోగ్య సమస్యలేమిటో తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పసుపు గోర్లు..(Yellow nails)

పసుపు గోర్లు ఇంటే దీన్ని ఎల్లో నెయిల్ సిండ్రోమ్ అని అంటారు. ఇది చాలా అరుదైన రుగ్మత. ఈ సమస్య ఉన్ వ్యక్తులలో గోర్లు మందంగా, పసుపు రంగులో ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, శ్వాస అవయవాలకు సంబంధించిన జబ్బులను సూచిస్తాయి.

పొడిబారిన గోర్లు లేదా పెళుసుగా ఉండే గోర్లు..(soft nails)

ఇది చాలామందిలో సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. ఈత కొట్టడం, నెయిల్ పాలిష్ రిమూవర్‌ని ఎక్కువగా ఉపయోగించడం, గ్లౌజులు లేకుండా రసాయనాలు ఉపయోగించడం, ఇంటి పనులు చేయడం, తేమ ఎక్కువగా ఉన్న వాతావరణానికి గోర్లు ప్రభావితం కావడం వల్ల ఇది జరుగుతుంది.

Health Tips: అమ్మ బాబోయ్.. ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తాయా..? ఈ 4 కూరగాయలను పచ్చిగానే తింటే..!



గోర్లు ఫ్లాట్ గా ఉండటం.. (flat nails)

గోర్లు ఫ్లాట్ గా ఉన్నప్పుడు వేలి చివర్లు ఉబ్బుతాయి. గోర్లు వంకరగా లేదా గుండ్రంగా మారుతాయి. ఇలాంటి గోర్లు ఉన్నవారిలో కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉండే అవకాశం ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు ఊపిరితిత్తులు, ప్రేగుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో కూడా గోర్లు ఇలా మారతాయి. జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన జబ్బులలో కూడా గోర్లు ఫ్లాట్ గా మారిపోతాయి.

గోర్ల మీద తెల్లని మచ్చలు..( white spots)

చిన్నతనంలో పిల్లలకు గోర్ల మీద తెల్లమచ్చలు తరచుగా వస్తుంటాయి. అది ల్యుకోనిచియా అనే సమస్యను సూచిస్తుంది. అయితే ఇది ఎలాంటి హాని చేయదు. కానీ కాలేయం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే థైరాయిడ్, కాల్షియం లోపం ఉన్న సందర్భాలలో కూడా గోర్ల మీద తెల్లని మచ్చలు వస్తాయి.

గోర్లపై నిలువు గీతలు.. (vertical lines)

కొంతమందికి గోళ్లపై నిలువు గీతలు ఉంటాయి, ఇవి సాధారణంగా గోళ్లకు నేరుగా గాయం కావడం వల్ల ఏర్పడతాయి. కొన్ని తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ గోర్లలో ఈ గీతలు కనిపిస్తాయి.

గోర్లు నల్లగా మారడం.. (black nails)

గోర్లు నల్లగా మారడం అనేది ప్రమాదకరం. ఇది మెలనోమా అనే చర్మానికి సంబంధించిన క్యాన్సర్ కు సంకేతం. గోర్ల మీద నలుపురంగు కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని నిర్లక్ష్యం చేకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Weight Loss Tips: 30 రోజుల్లో బరువు తగ్గడం ఎలా..? అయిదంటే అయిదే టిప్స్.. నెల రోజుల తర్వాత చెక్ చేసుకుంటే..!


Updated Date - 2023-09-27T14:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising