ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BodyBuilder Justin Vicky: పాపం.. మెడ విరిగిపోయింది.. వైరల్‌గా మారిన జిమ్‌ వీడియో..!

ABN, First Publish Date - 2023-07-22T16:27:09+05:30

ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఎంతోమందిని సోషల్ మీడియాలో లక్షల మంది దృష్టిని ఆకర్షించి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచిన జస్టిన్ విక్కీని ఇన్‌స్టాగ్రాంలో 33 వేల మందికి పైగానే ఫాలో అవుతున్నారు. కానీ.. పాపం చివరికి కసరత్తు చేస్తూనే ప్రాణం పోతుందని అతను కలలో కూడా అనుకుని ఉండడు. 210 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఆ బరువే మీద పడటంతో మెడ విరిగి జస్టిన్ విక్కీ ప్రాణాలు కోల్పోయాడు.

అందమైన శరీరాకృతి కోసం, ఆరోగ్యవంతమైన జీవనంలో భాగంగా జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం ఇటీవల అలవాట్లలో భాగంగా మారిపోయింది. మహా నగరాల్లో చాలామంది జిమ్‌కు వెళ్లి మంచి ఫిజిక్ కోసం శాయశక్తులా కృషి చేస్తుంటారు. అలాంటి బాడీ బిల్డర్స్‌లో ఇండోనేషియాలోని బాలికి చెందిన జస్టిన్ విక్కీ ఒకరు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఎంతోమందిని సోషల్ మీడియాలో లక్షల మంది దృష్టిని ఆకర్షించి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచిన జస్టిన్ విక్కీని ఇన్‌స్టాగ్రాంలో 33 వేల మందికి పైగానే ఫాలో అవుతున్నారు. కానీ.. పాపం చివరికి కసరత్తు చేస్తూనే ప్రాణం పోతుందని అతను కలలో కూడా అనుకుని ఉండడు. 210 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఆ బరువే మీద పడటంతో మెడ విరిగి జస్టిన్ విక్కీ ప్రాణాలు కోల్పోయాడు.


బాలిలోని పాపులర్ బాడీబిల్డర్స్‌లో ఇతను ఒకరు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెకండ్ల వ్యవధిలోనే విక్కీ కిందపడిపోయాడు. కసరత్తు చేస్తున్న సమయంలో విక్కీకి సాయంగా ఉన్న వ్యక్తి కూడా కాపాడలేకపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే జస్టిన్‌ను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. మెడ విరిగిపోవడం, గుండెకు, ఊపిరితిత్తులకు సంబంధించిన నరాలపై కూడా ప్రభావం పడటంతో జస్టిన్‌ను డాక్టర్లు కాపాడలేకపోయారు. అప్పటికీ అత్యవసర ఆపరేషన్ చేసినప్పటికీ జస్టిన్ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

33 ఏళ్ల వయసులోనే జస్టిన్ విక్కీ ప్రాణాలు కోల్పోవడంతో అతని సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన కసరత్తు చేసేవారిలో కల్లోలానికి కారణమైంది. వీడియో చూసిన వాళ్లంతా జిమ్‌లో శక్తికి మించి కసరత్తులు చేయకూడదని, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. అసలే ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ కుప్పకూలి చనిపోయిన ఘటనలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఓ కానిస్టేబుల్‌ జిమ్‌ చేస్తూ.. కాసేపు సేద తీర్చుకుంటుండగా, కుప్పకూలిపోయిన ఘటన కూడా ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-22T16:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising