కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: విమానం ప్రయాణం మొదలైన 2 గంటలకు బయటపడిన నిజం.. భయంతో యూటర్న్ తీసుకున్న పైలెట్.. అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-09-06T15:06:28+05:30

విమాన ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. పక్షిలా గాల్లో ఎగురుతూ మేఘాల మధ్య దూసుకుపోతున్న సమయంలో.. కిటికీలోంచి ఆ దృశ్యం కన్నులవిందు కలిగిస్తుంది. అయితే అప్పుడప్పుడూ విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితుల కారణంగా..

Viral: విమానం ప్రయాణం మొదలైన 2 గంటలకు బయటపడిన నిజం.. భయంతో యూటర్న్ తీసుకున్న పైలెట్.. అసలు కథేంటంటే..!
ప్రతీకాత్మక చిత్రం

విమాన ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. పక్షిలా గాల్లో ఎగురుతూ మేఘాల మధ్య దూసుకుపోతున్న సమయంలో.. కిటికీలోంచి ఆ దృశ్యం కన్నులవిందు కలిగిస్తుంది. అయితే అప్పుడప్పుడూ విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితుల కారణంగా గాల్లోకి లేచిన విమానం.. కొన్నిసార్లు గమ్యస్థానం చేరకుండానే తిరుగు ప్రయాణం అవుతుంటుంది. ఇలాంటి వార్తలు తరచూ వింటూ ఉంటాం. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానం ప్రయాణం మొదలైన 2 గంటలకే ఓ పైలెట్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ చక్కర్లు కొడుతోంది. యూఎస్‌లోని అట్లాంటా (US Atlanta) నుంచి ఓ విమానం స్పెయిన్‌లోని బార్సిలోనాకు (Spain Barcelona) బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల్లో ఓ వ్యక్తికి విరోచనాలు మొదలయ్యాయి. ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి సమస్యను పైలెట్ (Airplane pilot) దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరి పరిస్థితుల్లో పైలెట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి (Air Traffic Control) సమాచారం అందించాడు. ‘‘ప్రయాణికుడికి విచోచనాలు ఎక్కువ అవడం వల్ల తాము విమానాన్ని తిరిగి అట్లాంటాకు మళ్లించాలని అనుకుంటున్నాం’’.. అని సందేశాన్ని పంపించాడు.

Shocking: డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఆటో ఎక్కిందో యువతి.. కొద్దిదూరం వెళ్లగానే ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు..!

చివరకు విమానం అట్లాంటాకు వెనుదిరగాల్సి వచ్చింది. ప్రయాణికులందరినీ మరో విమానంలో బార్సిలోనాకు తరలించారు. అయితే ఈ సమస్య కారణంగా తమకు చాలా ఆసల్యం అయిందంటూ ప్రయాణికలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, విమానం వెనక్కి వచ్చిన తర్వాత విరోచనాలు అయిన ప్రయాణికుడికి సంబంధించిన ఎలాంటి వివరాలనూ అధికారులు వెల్లడించలేదు. ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ అధికారులు క్షమాపణలు తెలియజేశారు. కాగా, ప్రస్తుతం పైలెట్‌కు సంబంధించిన వాయిస్ రికార్డు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T15:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising