Food Habits: రోజూ పొద్దున్నే ఈ 5 రకాల టిఫిన్లను మాత్రం అస్సలు తినకండి.. పొరపాటున తింటే జరిగేది ఇదే..!
ABN, First Publish Date - 2023-08-16T11:01:06+05:30
రోజు మొత్తం చురుగ్గా, సమర్థవంతంగా పనిచేయాలంటే ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాత్రంతా విశ్రాంతిలో గడిపిన శరీరానికి ఉదయాన్నే మంచి ఆహారం అందించం ఎంతో అవసరం కూడా. కానీ ఈ 5 ఆహారాలు తీసుకుంటే మాత్రం..
రోజు మొత్తం చురుగ్గా, సమర్థవంతంగా పనిచేయాలంటే ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాత్రంతా విశ్రాంతిలో గడిపిన శరీరానికి ఉదయాన్నే మంచి ఆహారం అందించం ఎంతో అవసరం. పైపెచ్చు ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు దరిచేరవని చెబుతారు. కానీ ప్రతి రోజు ఇంటా, బయటా కామన్ గా తినే కొన్ని టిఫిన్లు ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. తీవ్రపరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ అయిదు రకాల టిఫిన్లు అస్సలు తినకూడదు.
శనగలు ఆరోగ్యానికి ఎంతోమంచివి, కానీ ఈ శనగల కాంబినేషన్లో అందరూ ఇష్టపడే చోలే భతురే లేదా పూరీ శనగల కూర ఆరోగ్యానికి చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల పూరీ కాంబినేషన్ గా బంగాళాదుంప కూర ఇస్తుంటారు. బయట తయారుచేసేపూరీలలో శుద్దిచేసిన గోధుమపిండి వినియోగిస్తారు. ఇది మైదాతో సమానం. దీన్ని చాలాసార్లు వినియోగించిన నూనెలో వేయించడం వల్ల చాలా దారుణమైన కొలెస్ట్రాల్ శరీరంలోకి చేరుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు పొరపాటున ఉదయాన్నే పూరీ తింటే ఆ ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా రక్తపోటు, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ స్థాయిలు దారుణంగా పెరుగుతాయి.
వీధుల్లో ఆహారాల తయారీ పెరిగిన తరువాత కేవలం ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేవారు చాలామంది తయారయ్యారు. సమయంతో సంబంధం లేకుండా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినాలనిపిస్తుంది. కొందరు ఫుడ్ విషయంలో కొత్త ప్రయోగాలు, కొత్త అలవాట్లు ప్రయత్నిస్తారు. ఉదయాన్నే టిపిన్ తో పాటు జిలేబి, రసగుల్లా, గులాబ్ జామున్ లాంటి స్పీట్స్ తింటుంటారు. మరికొందరు అప్పడాలను మంటమీద కాల్చి తింటారు. ఇవి ఎక్కువగా ఇతర రాష్ట్రాలలో తిన్నా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఫాలో అవుతారు. వీటివల్ల శరీరంలో చాలా తొందరగా చక్కెర నిల్వలు చేరతాయి. బరువు తగ్గాలని అనుకునేవారు వీటికి ఆమడదూరం ఉండాలి.
Health Tips: రోజుకొక యాపిల్ కాదు.. రోజుకొక జామపండు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. ముఖ్యంగా ఆ సమస్య ఉన్నవాళ్లకు..
ఇతర రాష్ట్రాలలో పరాతాలు, తెలుగు రాష్ట్రాలలో చపాతీలు, పరాటాలుగా పిలవబడే టిఫిన్ చాలా ఆరోగ్యకరమని అనుకుంటారు. ఆరోగ్య స్పృహ ఉన్నవారు క్యాలీఫ్లవర్ పరాతాలు, క్యాబేజీ, బంగాళాదుంప, పనీర్ వంటివి స్టఫ్ చేసి పరాతాలు తయారుచేస్తుంటారు. ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి వీటిని సన్నని మంట మీద ఎక్కువసేపు, ఎక్కువ నూనెలో కాలుస్తారు. తినడానికి రుచిగా ఉన్నా, ఆరోగ్యకరమని అనిపించినా ఈ పరాతాలు శరీరానికి చాలా నష్టం చేకూరుస్తాయి.
ఉదయాన్నే తొందరగా ఆఫీసులకు, స్కూళ్ళకు పరుగులు పెట్టే ఇళ్ళలో నూడిల్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. తొందరగా తయారైపోతాయనే కారణం వల్ల పిల్లలు పెద్దలు కూడా నూడిల్స్ వైపు మొగ్గు చూపుతారు. ఇవి టేస్ట్ గా ఉండటం మరొకకారణం కూడా. కానీ ఈ నూడిల్స్ తయారీకి మైదా, ఓట్స్ వంటివి వాడుతారు. వీటికి జోడించే రసాయనాల కారణంగా ఇవి శరీరంలో ఎముకలు, కణజాలానికి హాని తలపెడుతుంది. చాలామందికి నూడిల్స్ తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం గమనించవచ్చు. బరువు తగ్గాలని అనుకునేవారు పొరపాటున కూడా నూడిల్స్ లాంటి ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు.
ఇడ్లీ, పూరీ, దోశ వంటి వాటితో పాటు కాంబినేషన్ గా చాలా మంది తినేవి వడలు, గారెలు, బొండాలు. బజ్జీలు. బంగాళాదుంప స్టఫ్ చేసి తయారుచేసే బొండాలు అయినా, మైదా పిండితో చేసే మైసూరు బజ్జీలు అయినా, మినప గారెలు అయినా.. అన్నీ నూనెలో డీప్ ఫ్రై అయ్యేవే. వీటిని తినడం వల్ల మధుమేహం చాలా తొందరగా వస్తుంది. లివర్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. బరువు తగ్గాలని ప్రయత్నం చేసేవారికి ఇవి పెద్ద శత్రువులు.
Health Tips: అందరికీ కామన్ గా ఉండే ఈ 5 అలవాట్లే కొంప ముంచుతున్నాయ్.. వెంటనే వీటిని వదలకపోతే ఎంత నష్టమంటే..
Updated Date - 2023-08-16T11:01:06+05:30 IST