ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఒకే బాత్రూంలో ఇరుక్కుపోయిన కుక్క, చిరుతపులి.. చివరకు ఏం జరిగి ఉంటుందో కలలో కూడా ఊహించలేరు..!

ABN, First Publish Date - 2023-08-07T14:57:38+05:30

ఈ భూమి మీద జీవులు స్వేచ్ఛకు ఎక్కువ విలువనిస్తాయా? ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయా? స్వేచ్ఛకు మించిన విలువ ఈ భూమి మరిక దేనికీ లేదని అందరూ చెబుతుంటారు. బంధీగా ఉంటే తప్ప స్వేచ్ఛ విలువ తెలియదు. బంధీగా ఉన్నప్పుడు స్వేచ్ఛ తప్ప ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది.

ఈ భూమి మీద జీవులు స్వేచ్ఛకు (Freedom) ఎక్కువ విలువనిస్తాయా? ఆహారానికి (Food) ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయా? స్వేచ్ఛకు మించిన విలువ ఈ భూమి మరిక దేనికీ లేదని చెబుతుంటారు. బంధీగా ఉంటే తప్ప స్వేచ్ఛ విలువ తెలియదు. బంధీగా ఉన్నప్పుడు స్వేచ్ఛ తప్ప ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది. మనుషులకు మాత్రమే కాదు.. క్రూర జంతువులు (Wild Animals) కూడా ఆహారం కంటే స్వేచ్ఛకే తొలి ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న ఓ పోస్ట్ ఆ విషయాన్ని గట్టిగా చెబుతోంది.

ఈ ఘటన పాతదే అయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. IFS అధికారి పర్వీన్ కుమార్ రెండేళ్ల క్రితం ఈ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ ప్రకారం.. దక్షిణ కర్ణాటకలో అటవీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ గ్రామంలోకి చిరుత పులి (Leopard) ప్రవేశించింది. తనకు కనిపించిన కుక్కను (Dog) చంపి ఆకలి తీర్చుకోవాలని భావించింది. కుక్కను వెంటాడింది. ఆ కుక్క ప్రాణభయంతో ఓ ఇంట్లోకి దూరిపోయి టాయ్‌లెట్‌లో దాక్కుంది. చిరుత కూడా ఆ కుక్కను వెంబడిస్తూ టాయ్‌లెట్‌లోకి వెళ్లిపోయింది. ఆ రెండింటినీ గమనించిన ఇంటి వారు వెంటనే బాత్రూమ్ డోర్ వేసేశారు (Dog and leopard locked in toilet).

Viral Video: వామ్మో.. భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ సిబ్బంది దాదాపు మూడు గంటల తర్వాత అక్కడకు చేరుకున్నారు. వారు బాత్రూమ్ తలుపు తీసే సమయానికి కుక్క, చిరుత క్షేమంగా ఉన్నాయి. బంధీగా చిక్కుకున్న విషయం తెలుసుకున్న చిరుత ఆహారం గురించి మర్చిపోయింది. కుక్క జోలికి వెళ్లకుండా ఓ మూలకు వెళ్లి పడుక్కుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తర్వాత ఆ కుక్క స్థానికంగా సెలబ్రిటీ అయిపోయింది.

Updated Date - 2023-08-07T14:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising