Marriage: బాబోయ్.. ఇలాంటి చట్టం కూడా ఉంటుందా..? అక్కడ చనిపోయిన వాళ్లను కూడా పెళ్లి చేసుకోవచ్చట..!
ABN, First Publish Date - 2023-06-28T20:55:12+05:30
ఊపిరి ఉన్నంత వరకే ఏ బంధం అయినా.. ఒకసారి ప్రాణం పోయిందంటే దాంతో పాటే అన్ని బంధాలు, బంధుత్వాలన్నీ తెగిపోతాయి. పోయినవారిని కొన్నాళ్లు తలచుకోవడం.. క్రమక్రమంగా మర్చిపోవడం సర్వసాధారణం. అయితే చనిపోయిన వారితో తిరిగి బంధాన్ని కొనసాగించవచ్చా అంటే..
ఊపిరి ఉన్నంత వరకే ఏ బంధం అయినా.. ఒకసారి ప్రాణం పోయిందంటే దాంతో పాటే అన్ని బంధాలు, బంధుత్వాలన్నీ తెగిపోతాయి. పోయినవారిని కొన్నాళ్లు తలచుకోవడం.. క్రమక్రమంగా మర్చిపోవడం సర్వసాధారణం. అయితే చనిపోయిన వారితో తిరిగి బంధాన్ని కొనసాగించవచ్చా అంటే.. ఇదేం పిచ్చి ప్రశ్న అని అంటారు కదా. వినడానికి వింతగా ఉన్నా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతంలో చనిపోయిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చట. ఇందుకోసం ఏకంగా చట్టం కూడా ఉందట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో 2006లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వార్త (Viral news) ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మగాలీ జాస్కీవిచ్ అనే ఫ్రెంచ్ మహిళ (French woman) భర్త 2006లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఫ్రెంచ్ సివిల్ కోడ్‌లోని సెక్షన్ ప్రకారం.. చనిపోయిన భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. భర్త చనిపోవడంతో వితంతువుగా ఉన్న మహిళ.. ఏడాది తర్వాత తిరిగి చనిపోయిన తన భర్తను వివాహం (Remarrying) చేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేయడం ద్వారా ఆమె తిరిగి తన భర్తకు భార్యగా మారిపోయింది.
సదరు వ్యక్తి చనిపోక ముందే వివాహం చేసుకున్నట్లు ఆధారాలు సమర్పించడం ద్వారా అదే వ్యక్తిని తిరిగి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందట. కాగా, మహిళ వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం విచిత్రం.. మేము ఎక్కడా చూడలేదు, వినలేదు’’.. అని కొందరు, ‘‘చనిపోయిన భర్తను తిరిగి చేసుకోవడం వింతగా ఉంది’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
PAN Card: పాన్‌కార్డు ఉందా..? శుక్రవారం లోగా ఈ ఒక్క పని చేయకపోతే.. మీ పాన్ కార్డ్ ఇకపై పనిచేయదు..!
Updated Date - 2023-06-28T20:55:12+05:30 IST