ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. కశ్మీర్‌కు తీసుకెళ్లి ఆరు రోజుల పాటు నరకం.. ఆ తర్వాత ఎలా బెదిరించాడంటే..

ABN, First Publish Date - 2023-08-20T15:16:12+05:30

ఆ యువతి గ్వాలియర్‌లో ఇంజినీరింగ్ చదువుతోంది.. ఆమె తన క్లాస్‌మేట్‌ అయిన ఓ యువకుడితో స్నేహంగా ఉంటోంది.. సరదాగా కశ్మీర్ వెళ్దామని ఆ యువకుడు అడిగితే స్నేహితుడే కదా అని ఓకే చెప్పింది.. ఆమెను కశ్మీర్ తీసుకెళ్లిన యువకుడు నరకం చూపించాడు..

ఆ యువతి గ్వాలియర్‌ (Gwalior)లో ఇంజినీరింగ్ చదువుతోంది.. ఆమె తన క్లాస్‌మేట్‌ అయిన ఓ యువకుడితో స్నేహంగా ఉంటోంది.. సరదాగా కశ్మీర్ (Kashmir) వెళ్దామని ఆ యువకుడు అడిగితే స్నేహితుడే కదా అని ఓకే చెప్పింది.. ఆమెను కశ్మీర్ తీసుకెళ్లిన యువకుడు నరకం చూపించాడు.. ఓ హోటల్‌లో ఆమెను బంధించి ఆరు రోజుల పాటు అత్యాచారం చేశాడు (Harassment).. అంతేకాదు అత్యాచార ఘటనను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు (Crime News).

గ్వాలియర్‌లోని తాటిపూర్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. హస్తినాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ ప్రేమలో పడి కలిసి తిరగడం ప్రారంభించారు. రెండు నెలల క్రితం ఆ యువతిని యువకుడు కశ్మీర్ ట్రిప్‌నకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని యువతిపై ఆరు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

Viral: వైద్య రంగంలోనే అత్యంత అరుదైన కేసు.. 31 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ.. 92 ఏళ్లకు డెలివరీ!

తిరిగి గ్వాలియర్‌కు చేరుకున్న తర్వాత ఆ యువతిని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి నిలదీస్తే ఓ వీడియో చూపించి బెదిరించాడు. కశ్మీర్‌లో అత్యాచార సమయంలో తీసిన వీడియో అది. ఆ వీడియో చూసి షాకైన యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం అందరూ కలిసి ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-08-20T15:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising