Funny Video: రోడ్డు రోలర్‌ను బోట్లోకి ఎక్కించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-10-18T17:12:52+05:30
కొంత మంది వ్యక్తులు తమ బుర్రకు పదును పెట్టి కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. అద్భుతమైన ఐడియాతో పెద్ద సమస్యకు చెక్ పెడతారు. అయితే అన్నిసార్లూ ఆ ఐడియాలు సక్సెస్ కావు. చాలా సార్లు విఫలం కూడా అవుతుంటాయి.
కొంత మంది వ్యక్తులు తమ బుర్రకు పదును పెట్టి కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. అద్భుతమైన ఐడియా (Ideas)తో పెద్ద సమస్యకు చెక్ పెడతారు. అయితే అన్నిసార్లూ ఆ ఐడియాలు సక్సెస్ కావు. చాలా సార్లు విఫలం కూడా అవుతుంటాయి. అలంటి ఓ వీడియో (Jugaad Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. సైన్స్‌ను లైట్ తీసుకున్న ఓ వ్యక్తి అందుకు తగిన మూల్యం చెల్లించాడు. రోడ్డు రోలర్ (Road Roller)ను చిన్న పడవ (Boat) మీదకు ఎక్కించబోయి భారీ నష్టాన్ని మూట గట్టుకున్నాడు.
proasfalto అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్ రోలర్‌ను పడవలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పడవ మీద రెండు ఇనుప రాడ్లు పెట్టి వాటి సహయాంతో రోలర్‌ను బోటుపైకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాగోలా రోలర్ని పడవలోకి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత పడవ ఊగడం మొదలైంది. రోలర్ పడిపోకుండా ఉండేందుకు ఆ వ్యక్తి ఏవో ప్రయత్నాలు చేశాడు. అయితే రోలర్ బరువు కాయలేక పడవ ఎక్కువగా ఊగిపోయింది. దీంతో రోలర్ కిందకు జారడం మొదలైంది.
Viral News: యజమాని చనిపోయాడని తెలియక.. ఏడాది నుంచి ఆస్పత్రి ముందే పడిగాపులు కాస్తున్న కుక్క..
రోలర్ కింద పడిపోతున్న సమయంలో ఆ వ్యక్తి కిందకు దూకేశాడు. లక్షల విలువైన రోలర్ నీటిలో పడి మునిగిపోయింది. నీటి మీద ఉన్న పడవ మామూలుగానే ఊగుతుంటుంది. అలాంటిది అంత బరువైన మెషిన్ పెడితే పడవ ఎలా కాయగలుగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 3.7 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-18T17:12:52+05:30 IST