Funny Video: అమ్మాయిలను ఎలా టీజ్ చెయ్యాలో ఈ వానరాలకు బాగా తెలిసినట్టుంది.. బిస్కెట్లు ఇవ్వబోతే ఏం చేశాయో మీరే చూడండి..
ABN, Publish Date - Dec 15 , 2023 | 04:56 PM
ఓ అమ్మాయి సరదాగా కోతులకు బిస్కెట్లు ఇవ్వబోతే అవి చేసిన పనికి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుతున్నారు.
మూగజీవులకు ఆహారం పెట్టడం చాలా సహజమైన విషయం. సాధారణంగా కుక్కలు, పిల్లులకు, కోతులకు ఆహారం ఇస్తుంటారు. అవి కూడా ఎవరైనా ఆహారం ఇస్తే చాలా ఆత్రంగా అందుకుని తింటాయి. ఓ అమ్మాయి సరదాగా కోతులకు బిస్కెట్లు ఇవ్వబోతే అవి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫుల్లుగా నవ్వుతున్నారు. ఆ కోతులకు అమ్మాయిలను ఎలా టీజ్ చెయ్యాలో తెలుసు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడున్న జంతువులకు కూడ ఆహారం పెట్టి ముచ్చట పడుతుంటారు చాలా మంది. ఓ అమ్మాయి కూడా కోతులను చూసి తన దగ్గరున్న బిస్కెట్లను వాటికి ఇవ్వడానికి ప్రయత్నించింది. వీడియోలో అమ్మాయి తన చేతిలో బిస్కెట్ ప్యాకెట్ తో కనిపిస్తుంది. ఆమె బిస్కెట్లు తీసి పక్కనే బ్రిడ్జ్ గోడలమీద నడుస్తూ వెళుతున్న కోతికి ఇస్తుంది. అయితే ఆ కోతి ముందుకు వంగి బిస్కెట్లు తీసుకుని వాటిని పక్కకు విసిరేస్తుంది. దీంతో ఆ అమ్మాయి ప్యాకెట్ నుండి మరో బిస్కెట్ తీసుకుని వెనక వస్తున్న వేరే కోతులకు కూడా ఇస్తుంది. రెండవ కోతి బిస్కెట్ తీసుకుని కిందకు విసిరేసి వెళ్లిపోయింది. మూడవ కోతి కూడా బిస్కెట్ తీసుకుని వాసన చూసి మరీ దాన్ని కోపంగా విసిరి వెళ్లిపోయింది. ఈ కోతుల ప్రవర్తనకు ఆ అమ్మాయి ఒక వైపు నవ్వుతున్నా అవి చేసిన పనికి ఆమె షాకవడం కూడా గమనించవచ్చు.
ఇది కూడా చదవండి: Relationship Advice: రాత్రి పడుకునే ముందు భర్తలు ఈ మూడు పనులు చేస్తే చాలు.. భార్యలు ఫుల్లు హ్యాపీ..!
ఈ వీడియోను saloni_satpute_offical అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు.'అందమైన అవమానం' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో స్పందిస్తున్నారు. 'ఆ కోతులు ఎమోషనల్ డ్యామేజ్ చేశాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'చాలా ఫన్నీగా ఉంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'కోతులు బ్రాండ్ టెస్ట్ చేసి మరీ కిందకు విసిరేశాయి' అని ఇంకొకరు సెటైర్ వేశారు.
ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 15 , 2023 | 04:57 PM