Viral Video: ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టుకుంటారా? నడిరోడ్డు మీద వీళ్లెందుకు కొట్టుకుంటున్నారో తెలిస్తే నవ్వు రాక మానదు!
ABN, First Publish Date - 2023-09-01T11:57:06+05:30
మన దేశంలో పానీపూరీని ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ పానీపూరీ అంటే ఎంతో ఇష్టపడతారు. రోడ్డు పక్కన ఉండే పానీపూరీ స్టాల్స్ ముందు క్యూ కడతారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ పానీపూరీ బండి ముందు పెద్ద ఫైటింగ్ జరిగింది. దాని వెనక ఉన్న కారణం తెలిస్తే మాత్రం నవ్వు రాక మానదు.
మన దేశంలో పానీపూరీని (Panipuri) ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ పానీపూరీ అంటే ఎంతో ఇష్టపడతారు. రోడ్డు పక్కన ఉండే పానీపూరీ స్టాల్స్ ముందు క్యూ కడతారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ పానీపూరీ బండి ముందు పెద్ద ఫైటింగ్ జరిగింది. దాని వెనక ఉన్న కారణం తెలిస్తే మాత్రం నవ్వు రాక మానదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతోంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అఖిల్ తిరహా సమీపంలోని హమీర్‌పూర్‌లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. 10 రూపాయలకు కేవలం 7 పానీపూరీలు మాత్రమే ఇచ్చినందుకు పానీపూరీ విక్రేతను (Panipuri seller) ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. రూ.10 తీసుకుని కేవలం 7 పానీపూరీలు మాత్రమే ఇచ్చినందుకు కిషోర్ కుమార్ అనే కస్టమర్ పానీపూరీలు అమ్మే రామ్‌పై దాడికి దిగాడు. ఇద్దరూ రోడ్డు మీద పడి దొర్లుకుంటూ మరీ కొట్టుకున్నారు. అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Fight with Panipuri seller).
Viral Video: తల్లీ నీకు పాదాభివందనం.. రోడ్డు పక్కన పళ్లు అమ్ముకుంటూ పిల్లలను చదివిస్తున్న మహిళ.. వీడియో వైరల్!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ``రూ.10కి 7 పానీపూరీలు ఇస్తున్నారంటే గొప్పే. బెంగళూరులో అయితే రూ.30కి 6 మాత్రమే ఇస్తారు``, ``పానీపూరీ ఫైటింగ్``, ``ఈ ఫైటింగ్‌కు విలువ ఉంది``, ``ఎక్కువ పానీపూరీలు ఇస్తున్నాడని కొట్టాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-09-01T11:57:06+05:30 IST