ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jeet Adani engagement: అదానీ కొడుకు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు బ్యాగ్రౌండ్ ఇదే..

ABN, First Publish Date - 2023-03-14T16:47:50+05:30

దేశీయ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ (Gautham Adani) తనయుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: దేశీయ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ (Gautham Adani) చిన్నకొడుకు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వజ్రాల వ్యాపారి, సీ.దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దివా జైమిన్ షా (Diva Jaimin Shah) కూతురు దివాతో (Diva) జీత్‌కు నిశ్చితార్థం (jeet adani engagement) జరిగింది. కాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మార్చి 12న ఆదివారం నిరాడంబరంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు అత్యంత సన్నిహిత స్నేహితులు, బంధువులు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారని సమాచారం.

ఈ కార్యక్రమం ప్రైవేటు వేడుక కావడంతో వివరాలు పెద్దగా తెలియరాలేదు. అయితే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి బయటకొచ్చిన ఒక ఫొటో ప్రకారం.. కాబోయే దంపతులిద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి చూడముచ్చటగా ఉన్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, లేత నీలి రంగు దుపట్టాలో దివా మెరిసిపోతుండగా.. జీత్ అదానీ కూడా అదే రంగు దుస్తులను ధరించాడు. లేత నీలి కుర్తాతో ఎంబ్రాయిడరీ జాకెట్‌‌తో ఆకట్టుకునేలా కనిపించాడు.

దివా బ్యాగ్రౌండ్ ఇదే..

దివా బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. సంపన్న కుటుంబానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఆమె తండ్రి జైమిన్ షా.. సీ దినేష్ అండ్ కో-ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమానిగా ఉన్నారు. ఈ కంపెనీ ముంబై, సూరత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ ప్రస్తుత డైకెర్టర్లలో జైమిన్ షా కూడా ఉన్నారు.

కాగా జీత్ అదానీ (Jeet adani) అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైయిడ్ సైన్సెస్’లో ఉన్నత చదువులను పూర్తి చేశాడు. 2019లో అదానీ గ్రూపులో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. గ్రూప్ సీఎఫ్‌వో ఆఫీస్‌లో కెరియర్ మొదలుపెట్టిన ఆయన.. స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రీస్క్ అండ్ గవర్నెన్స్ పాలసీపై దృష్టిసారించారని అదానీ గ్రూప్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక అదానీ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌తోపాటు (Adani airports Business) అదానీ డిజిటల్ ల్యాబ్స్ వ్యాపారాలు కూడా ఆయన సారధ్యంలోనే కొనసాగుతున్నాయని సమాచారం పేర్కొంది. అదానీ గ్రూప్ వ్యాపారాల వినియోగదారుల కోసం ఒక సూపర్ యాప్‌ను రూపొందించబోతున్నట్టు వివరించింది. కాగా గౌతమ్ అదానీ పెద్ద కొడుకు ప్రసిద్ధి ష్రోఫ్‌కు ఇదివరకే పెళ్లయ్యింది.

Updated Date - 2023-03-14T17:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising