Ram Charan: మెగా పవర్ స్టార్ బర్త్‌డేకి గీతా ఆర్ట్స్ ఇస్తోన్న గిఫ్ట్ ఇదే..
ABN, First Publish Date - 2023-02-23T16:50:54+05:30
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పేరు ఇప్పుడు గ్లోబల్‌గా మారుమోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో ఆయన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పేరు ఇప్పుడు గ్లోబల్‌గా మారుమోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో ఆయన హాలీవుడ్ (Hollywood) రేంజ్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం చరణ్.. హాలీవుడ్‌లో నిర్వహించే అవార్డుల ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వెళ్లారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి దక్కని ఘనతను ఆయన దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్‌కి (Mega Fans) గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థ తాజాగా ఓ గుడ్ న్యూస్‌ని తెలియజేసింది. అదేంటంటే..
రామ్ చరణ్ ‘చిరుత’ (Chirutha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, చిరు తనయుడు అనిపించుకున్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ సొంత ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న చరణ్.. రెండవ సినిమాతో ‘మగధీర’ (Magadheera)గా వచ్చి, తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) ఒక కొత్త చరిత్రను లిఖించాడు. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ 13 ఏళ్ల క్రితమే అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ (Allu Aravind).. తన దగ్గరున్న మొత్తాన్ని వెచ్చించి మేనల్లుడుకి ‘మగధీర’ని గిఫ్ట్‌గా (Gift) ఇచ్చారు. అయితే అరవింద్ వెచ్చించిన దానికి మూడింతలు మగధీర సినిమా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్.. పుష్కలంగా ఉన్న సినిమా మగధీర.
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రంలోని ‘కాలభైరవ, మిత్రవింద’ పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ‘మగధీర’ సినిమా మళ్ళీ ఇప్పుడొస్తే ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా, అదే జరగబోతుంది. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (Ram Charan Birthday) సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ (Re-Release) చేయబోతున్నారు. ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థే ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతోంది. అప్పుడు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న ‘మగధీర’ చిత్రం.. మరి ఈ సారి సృష్టించే ప్రకంపనలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే.. మెగా పవర్ స్టార్ బర్త్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి
*********************************
Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?
Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు
Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!
Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్
Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం
Updated Date - 2023-02-23T17:27:52+05:30 IST