ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP: కాళ్లూ చేతులు కట్టేసి.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. 13 ఏళ్ల బాలిక దారుణ హత్య.. పోస్ట్‌మార్టం రిపోర్టులో షాకింగ్ నిజం..!

ABN, First Publish Date - 2023-01-26T17:40:51+05:30

సెలవులకు స్కూల్ నుంచి ఇంటికొచ్చిందో 13 ఏళ్ల బాలిక. కుటుంబంతో సంతోషంగా గడిపి తిరిగెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్ది రోజులకే హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక పోస్ట్‌మార్టం రిపోర్టులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సెలవులకు స్కూల్ నుంచి ఇంటికొచ్చిందో 13 ఏళ్ల బాలిక. కుటుంబంతో సంతోషంగా గడిపి తిరిగెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్ది రోజులకే హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగిన ఈ హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆమెను కాళ్లు, చేతులూ కట్టేసి నేలపై ఈడ్చుకెళ్లినట్టు బయటపడింది. ఈ నెల 20న జరిగిన ఈ హత్యకు సంబంధించి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాలోన్ ప్రాంతానికి చెందిన జస్రామ్ కుమార్తె ప్రియా రాథోడ్ లఖ్‌నవూలో(Lucknow) ఉన్న ఎస్ ఆర్ కాలేజీలో చదివేది. ఈ నెల 20న ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. అర్ధరాత్రి హాస్టల్‌ భవంతి పక్కనే రక్తపుమడుగులో ప్రియ మృతదేహాన్ని గుర్తించిన కాలేజీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. లఖ్‌న వూకు చేరుకున్న వారు కూతురి మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక మృతురాలి పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మెడ, వెన్నుపూసలోని పలు ఎముకలు విరిగిపోయినట్టు తేలింది. కాళ్లు, చేతుల, వీపుపై కనిపించిన గాయాలను బట్టి ఆమెను తీవ్రంగా కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గొంతుపై గాయాలు కావడంతో ఆమెను ఎవరో గొంతుపట్టి నేలపై ఈడ్చికెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా.. ఘటన విషయంలో పాఠశాల యాజమాన్యం కూడా భిన్న వాదనలు వినిపిస్తుండటంతో ఇది హత్యేనన్న నిర్ధారణకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం మంగళవారం నాడు ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

Updated Date - 2023-01-26T17:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising