Girlfriend: నమ్మవా.. అంటూ విషం బాటిల్‌ను ఫొటో తీసి వాట్సప్ చేసిన ప్రేయసి.. ఓకే అని రిప్లై ఇచ్చిన ప్రియుడు.. చివరకు..!
ABN, First Publish Date - 2023-08-01T16:11:03+05:30
ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ యువతికి రెండో వివాహం జరిపించారు. పది రోజుల క్రితం ఆమె అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సోమవారం ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం (Marriage) జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్తకు విడాకులు (Divroce) ఇచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ యువతికి రెండో వివాహం జరిపించారు. పది రోజుల క్రితం ఆమె అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సోమవారం ఆమె విషం (Poison) తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆమె వాట్సాప్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది (Crime News).
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌కు సమీపంలో మోహన్ గఢ్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తన ప్రియుడికి వాట్సాప్ ద్వారా విషం బాటిల్ ఫొటోను పంపించింది. వెంటనే ఆమె ప్రియుడు (Lover) ``ఓకే`` (Ok) అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. భోజనం చేసిన తర్వాత విషం తాగేసింది. కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్‌కు తరలించే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Wife: పెళ్లయ్యాక మొదటిసారి పుట్టింటికెళ్లిన భార్య.. అదే రోజు భర్త ఆత్మహత్య.. అసలు కారణమేంటో తెలిసి..!
ఆ యువతికి రెండేళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు రెండో వివాహం చేశారు. ఆమె చదువుకునే వయసు నుంచే ఓ వ్యక్తిలో ప్రేమలో ఉంది. వివాహం తర్వాత కూడా అతడితో సంబంధాన్ని కొనసాగించింది. రెండో పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆ యవతిని తన ప్రియుడిని రహస్యంగా కలుస్తూ ఉండేది. తాజాగా వారిద్దరి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. తాను చనిపోతానని ఆమె ప్రియుడిని బెదిరించింది. అతడు పట్టించుకోలేదు. దీంతో ఆమె విషం తాగి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-08-01T16:11:03+05:30 IST