ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆ తిప్పలు తప్పినట్లే..

ABN, First Publish Date - 2023-02-18T10:27:14+05:30

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే.. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే.. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే ఆటో, ట్యాక్సీ కావాలా అంటూ ఒకేసారి డ్రైవర్లు మీద మీదపడిపోతుంటారు. అయితే దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని కొయ్యంబత్తూర్ రైల్వే స్టేషన్‎లో.. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్‎లోని వాట్సాప్ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోను బుక్ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది. తమిళనాడులో చెన్నై రైల్వేస్టేషన్ తర్వాత అంతటి రద్దీ గల స్టేషన్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది రైల్వేశాఖ.

ఇందులో భాగంగానే ఇప్పటికే.. ప్రయాణికుల వసతి కోసం ఆధునిక ఎయిర్ కండీషన్ గదిని ప్రారంభించింది. ఇప్పుడు వాట్సాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే..కోయంబత్తూర్‎లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉర్క్ క్యాబ్ సంస్థ ఈ కాంట్రాక్ట్ ను పొందింది. ‘‘ఉర్క్ క్యాబ్స్’’ యాప్ ద్వారా కానీ. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి.. వాట్సాప్ ద్వారా కానీ, ఆటోను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రైల్వే శాఖ. ప్రయాణికులు 8094880980 నెంబర్ కి టెక్ట్స్ మెసేజ్ చేసి కూడా ఆటోను బుక్ చేసుకోవచ్చు.. డ్రైవర్‎కి, ప్రయాణికులకు ఆమోదయోగ్యమైన ప్రయాణమే సాగించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Updated Date - 2023-02-18T10:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising