ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పెళ్లికి గడ్డం తీయాలని తండ్రి.. వద్దని వధువు.. కాబోయే భార్య మాట విన్నందుకు ఎంత పని జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-08-22T16:17:44+05:30

పాపం.. గడ్డం ఆ వరుడి పాలిట శాపంలా మారింది. తండ్రి, కాబోయే భార్య మధ్య నలిగిపోయేలా చేసింది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడిని విషాదంలో మునిగిపోయేలా చేసింది. కాబోయే భార్య మాట విని గడ్డం గీసుకోకపోవడం అతడి తండ్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

పాపం.. గడ్డం ఆ వరుడి (Groom) పాలిట శాపంలా మారింది. తండ్రి, కాబోయే భార్య (Bride) మధ్య నలిగిపోయేలా చేసింది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడిని విషాదంలో మునిగిపోయేలా చేసింది. కాబోయే భార్య మాట విని గడ్డం గీసుకోకపోవడం అతడి తండ్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పెళ్లికి ముందే కొడుకు తన మాట వినడం లేదని తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ తండ్రి ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేశాడు. తమిళనాడు (Tamilnadu)లోని కోయంబత్తూరులో ఈ విచిత్ర ఘటన జరిగింది (Virl News).

కోయంబత్తూరుకు సమీపంలోని సూలూరుకు చెందిన ఓ వ్యక్తికి మూడు నెలల క్రితం పొల్లాచ్చికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరు వర్గాల వారూ మూడు నెలలుగా పెళ్లి పనులతో బిజీ అయ్యారు. కాగా, వరుడు గడ్డం తీయకుండా మూడు నెలలుగా పెంచుతూనే ఉన్నాడు. దీంతో వరుడి తండ్రి పెళ్లి సమయానికి గడ్డం (Beard) తీసేయాల్సిందిగా సూచించాడు. వధువు మాత్రం గడ్డం తీయవద్దని, కాస్త ట్రిమ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పింది. కాబోయే భార్య మాటకు విలువ ఇచ్చిన వరుడు గడ్డం తీయలేదు. కొడుకు గడ్డం తీయకపోవడంతో వరుడి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎందుకు తీయలేదని ప్రశ్నించాడు.

Wife: పాపం.. ఆ భర్త ఎంత అమాయకుడు.. భార్యను కష్టపడి చదివించాడు.. గవర్నమెంట్ జాబ్ సంపాదించిన ఆమె ఏం చేసిందంటే..

కాబోయే భార్య వద్దనడంతోనే గడ్డం తీయలేదని, కాస్త ట్రిమ్ చేసుకున్నానని చెప్పాడు. ఈ సమాధానం విని తండ్రికి చిర్రెత్తిపోయింది. పెళ్లికి ముందే తన మాటకు విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించి, గడ్డం తీసేస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. తండ్రిని సముదాయించేందుకు వరుడు ప్రయత్నించాడు. అస్సలు వెనక్కి తగ్గని తండ్రి పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంటూ బంధువులకు, వధువు తరఫు వారికి మెసేజ్‌లు పంపించేశాడు. దీంతో సోమవారం జరగాల్సిన ఆ వివాహం ఆగిపోయింది.

Updated Date - 2023-08-22T16:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising