కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Most Expensive Teapot: ఎంత బాగుందో.. కొనేద్దాం.. అని కలలో కూడా ఊహించకండి.. ఈ టీ పాట్ ధర ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-08-12T16:39:08+05:30

కొందరైతే ఏదైనా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కొనేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ పాట్‌ కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీన్ని కొనడం అంత ఈజీ మాత్రం కాదు. అసలు ఈ టీపాట్ గురించి తెలిస్తే..

Most Expensive Teapot: ఎంత బాగుందో.. కొనేద్దాం.. అని కలలో కూడా ఊహించకండి.. ఈ టీ పాట్ ధర ఎంతో తెలిస్తే..!

ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కోరిక ఉంటుంది. కొందరికి ఖరీదైన దుస్తులు వేసుకుని, అంతే ఖరీదైన కార్లలో తిరగాలని ఉంటుంది. అలాగే మరికొందరు తమ ఇంట్లోని ప్రతి వస్తువూ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇందుకోసం కొందరు ఫర్నీచర్ దగ్గరి నుంచి ప్రతి ఒక్క వస్తువును ఎక్కడెక్కడి నుంచో లక్షలు ఖర్చు చేసి మరీ తెప్పిస్తుంటారు. కొందరైతే, ఏదైనా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కొనేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ పాట్‌ కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీన్ని కొనడం అంత ఈజీ మాత్రం కాదు. అసలు ఈ టీపాట్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు.

సోషల్ మీడియాలో ఓ టీపాట్‌కు సంబంధించిన వార్త (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎక్కడైనా అల్యూమినియంతో చేసిన టీ పాట్ (tea pot) మాత్రమే కనిపిస్తుంటుంది. అది కూడా అక్కడక్కడా ఉన్న టీ స్టాళ్లలో, మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లలోని టీ అమ్మే వారి వద్ద ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక టీ ప్రియులైతే తమ ఇళ్లలోకి వివిధ రకాల డిజైన్లలో ఉన్న టీ పాట్‌లను తెప్పించుకుంటుంటారు. డబ్బున్న వారైతే ఖరీదు చేసే పింగాణి టీ పాట్‌లను కొంటూ ఉంటారు. వీటి ధర కూడా మహా అయితే వేలల్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీ పాట్ ధర ఎంతో తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.

Metro Train: మెట్రో రైల్లో సరదాగా మాట్లాడుకుంటున్న ఫ్రెండ్స్.. సడన్‌గా వాళ్ల వద్దకు వచ్చిందో మహిళ.. ఆమె చెప్పింది విని..!

యూకేకి (UK) చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్ యాజమాన్యం.. 18 క్యారెట్ల బంగారంతో కూడిన టీపాట్‌ను (tea pot made of gold) తయారు చేయించింది. దీని ధర 2016లో $30,00,000 మిలియన్లు (రూ.2,488,678.34) అని తెలిసింది. ఈ టీ పాట్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే.. దీని హ్యాండిల్‌ని వేల సంవత్సరాల కిందట అంతరించిన మమూత్ (Mammoth) అనే జంతువు దంత శిలాజం నుంచి తయారు చేశారట. అందుకే ఈ టీపాట్.. ఇంత ప్రత్యేకతను సంతరించుకుంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గుర్తిస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral News: వామ్మో.. ఆగస్టు 14వ తారీఖే అందరికీ జ్వరం వచ్చేస్తోందట.. ప్రైవేటు ఉద్యోగుల వింత సాకుల వెనుక..!

Updated Date - 2023-08-12T16:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising