ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Golden Globe Awards: ఎన్టీఆర్ భాషపై విమర్శలు.. అది భారతీయ సినిమాకే మంచిదంటూ..

ABN, First Publish Date - 2023-01-12T11:43:30+05:30

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన సంగతి తెలిసిందే.

NTR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song) విభాగంలో ఈ అవార్డుని గెలుచుకుంది. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కీరవాణి స్టేజ్ మీదకి వెళ్లి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మూవీ హాలీవుడ్ మీడియాతో మూవీ టీం మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకుంది. అయితే.. ఈ తరుణంలో ఎన్టీఆర్ (NTR) అమెరికన్ యాస (American Accent)లో మాట్లాడారు. దీంతో చాలామంది నెటిజన్లు ఆయన యాస‌పై ట్రోలింగ్ చేశారు.

దీంతో ఎన్టీఆర్ యాసెంట్ అంత దారుణంగా ఏం లేదంటూ బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తెలిపాడు. ఆయన షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘న్టీఆర్ యాస జనాలు విమర్శించేంత దారుణంగా ఉందని నేను అనుకోట్లేదు. అలాగే అది అక్కడి పీఆర్‌ వ్యూహం కావొచ్చు. లైట్ తీసుకోండి.. ఆయన్ని కొత్తగా ప్రయత్నించనివ్వండి. ఆయన హాలీవుడ్ గ్లోబల్ మార్కెట్‌ వరకు చేరితే అది భారతీయ సినిమాకే మంచిది. మనమందరం దాని నుండి ప్రయోజనం పొందుతాం’ అని సపోర్టుగా రాసుకొచ్చాడు.

Updated Date - 2023-01-12T11:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising