Guns: మాకు తుపాకులిప్పించండి సార్..

ABN, First Publish Date - 2023-05-04T12:39:23+05:30

గ్రామ నిర్వహణ అధికారి (వీఏఓ)లకు తుపాకులు అందజేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు వీఏఓ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది.

Guns: మాకు తుపాకులిప్పించండి సార్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): గ్రామ నిర్వహణ అధికారి (వీఏఓ)లకు తుపాకులు అందజేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు వీఏఓ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... తూత్తుకుడిలో దారుణహత్యకు గురైన వీఏఓ లూర్త ఫ్రాన్సిస్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. తూత్తుకుడి ఘటనలాగే సేలం జిల్లా ఓమలూరు తాలూకా వీఏఓ వినోద్‌కుమార్‌కు కూడా ఇసుక మాఫియా నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలతో వీఏఓ(VAO)లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయన్నారు. అయినా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడంలో నిజాయితీగా పని చేస్తున్నారని తెలిపారు. వీఏఓల ఆత్మరక్షణార్థం తగిన శిక్షణ అందించాలని కోరారు. అలాగే, అవసరమైతే తుపాకి అందించేలా ప్రభుత్వ పరిశీలించాలన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అదే సమయంలో పనిచేసే గ్రామాల్లో బస చేయడంపై మినహాయింపు ఇవ్వాలని

Updated Date - 2023-05-04T12:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising