ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Fall: జుట్టు ఎందుకు రాలుతుంది? అందరూ చెప్పే కారణాలలో నిజాలెంత? అబద్దాలెంత?

ABN, First Publish Date - 2023-07-02T17:46:41+05:30

హెయిర్ ఫాల్ అవుతున్న గందరగోళంలో నిజానిజాలేంటో తెలుసుకోకుండా చాలామంది గుడ్డిగా కొన్ని ఫాలో అవుతుంటారు. జుట్టురాలడం గురించి అందరిలో ఉన్న నమ్మకాలలో నిజాలేవి? అపోహలు ఏవి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పట్లో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్(Hair Fall). ఈ హెయిర్ ఫాల్ వల్ల జుట్టు పలుచబడిపోవడమే కాకుండా కొందరిలో బట్టతల కూడా వస్తుంది. చాలా మంది హెయిర్ ఫాల్ కు రకరకాల కారణాలు చెబుతుంటారు. హెయిర్ ఫాల్ అవుతున్న గందరగోళంలో నిజానిజాలేంటో తెలుసుకోకుండా చాలామంది గుడ్డిగా కొన్ని ఫాలో అవుతుంటారు. జుట్టురాలడం గురించి అందరిలో ఉన్న నమ్మకాలలో నిజాలేవి? అపోహలు ఏవి పూర్తీగా తెలుసుకుంటే..

తలస్నానం చేస్తే జుట్టురాలడం అధికమవుతుందా?(Head bath increase hair fall)

జుట్టురాలే సమస్య ఉన్న వారు తల స్నానం చెయ్యాలంటే భయపడుతుంటారు. దీనికి కారణం జుట్టు చిక్కులు ఏర్పడటం, ఎక్కువగా దువ్వాల్సి రావడం. మరీ ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకు ఉన్న నూనె షాంపూ చేయడం వల్ల క్లీన్ అయిపోతుంది. ఈ కారణంగా జుట్టురాలుతుందని నమ్ముతారు. కానీ ఇది నిజంకాదు. తల స్నానం చెయ్యడం వల్ల జుట్టు కుదుళ్ళలో ఉన్న మురికి శుభ్రపడుతుంది. ఇది జుట్టుకు మేలు చేసేదే తప్ప చెడు చేయదు.

Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..


ఎక్కువ ఎండలో(sun hot) బయటకు వెళ్తే హెయిర్ పాల్ పెరుగుతుందా?

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే జుట్టు డ్యామేజ్ అవుతుందని నమ్ముతారు. కానీ ఇది కూడా అపోహే.. సూర్యకాంతి జుట్టు కుదుళ్ళపై ప్రభావం చూపదు. ఎండకు, హెయిర్ ఫాల్ కు అసలు సంబంధమే లేదు.

విటమిన్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయవచ్చు..(vitamin supplements)

చాలామంది హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు విటమిన్ లోపమే దానికి కారణమని అనుకుంటారు. దీనికి పరిష్కారంగా విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం చాలా తప్పు. విటమిన్ సప్లిమెంట్ల గురించి పూర్తీగా తెలుసుకోకుండా వాటిని వాడితే హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-ఇ ఎక్కువైతే జుట్టు రాలడం(vitamin-E increase hair fall) మరింత వేగమవుతుంది.

టోపీ(cap) పెట్టుకుంటే హెయర్ ఫాల్ అవుతుందా?

చాలామంది కుర్రాళ్ళు టోపీ పెట్టుకోవాలంటే హెయిర్ ఫాల్ అవుతుందని అవాయిడ్ చేస్తుంటారు. కానీ టోపీ పెట్టుకోవడానికి, హెయిర్ పాల్ కు సంబంధమే లేదు. టోపీ పెట్టుకోవడం వల్ల జుట్టు చివర్లు లోపలికి ఒత్తుకోబడతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్ళకు ఎటువంటి హాని జరగదు. జుట్టు పైన పడే ఒత్తిడి జుట్టును లోతుగా ప్రభావితం చెయ్యదు.

ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుందా?.(depression reason of hair fall)

ఇప్పట్లో మానసిక ఒత్తిడి అనుభవించేవారు ఎక్కువే ఉన్నారు. ఈ మానసిక ఒత్తిడి జుట్టు సంబంధ సమస్యలను పెంచుతోంది. ఇది హెయిర్ గ్రోత్ సిస్టమ్ మీద ప్రభావితం చూపిస్తుంది. అంతే కాదు, జుట్టు తెల్లబడటం కూడా దీనివల్ల జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం వల్ల, జన్యు సమస్యల వల్ల జుట్టురాలడం పెరుగుతుంది.

Viral Video: దేవుడు నడిపే డ్రామాలు ఇలానే ఉంటాయా? కొంగను వేటాడాలని సైలెంట్ గా వెళ్ళిందొక మొసలి.. చివరకేం జరిగిందో చూస్తే..


Updated Date - 2023-07-02T17:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising