ఇష్టంగా వాడుకునే బైక్ ను అమ్మి మరీ విమానం టికెట్ కొన్నాడు.. ఇతని కష్టం వృథా పోలేదు.. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడంటే..
ABN, First Publish Date - 2023-01-09T11:50:03+05:30
చేతిలో పైసా లేదు.. ఇక చివరికి ఏదైతే అది కానీ అనుకుని..
అతను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఒకవైపు ఫారిన్ వెళ్ళే అవకాశం, మరొకవైపు చేతిలో పైసా లేదు.. ఇక చివరికి ఏదైతే అది కానీ అనుకుని తను ఎంతో ఇష్టంగా వాడుకునే తన బైక్ ను అమ్మేసాడు. అదే అతని జీవితాన్ని మలుపుతిప్పింది. ఇతనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అది 1991 సంవత్సరం. రాజేష్ ముంబైలో వెబ్సైట్ డిజైనింగ్ లో సేల్స్ జాబ్ చేస్తున్నాడు. అతని పనితీరు నచ్చి అతనికి కంపెనీ వారు లండన్ వెళ్ళే అవకాశం ఇచ్చారు. 'వెళ్ళడానికి టికెట్ నువ్వే తీసుకో తరువాత ఆ డబ్బు కంపెనీ ఇస్తుంది' అని చెప్పారు. ఒకవైపు రాజేష్ కు లండన్ వెళ్ళాలని ఉంది. మరొకవైపు చేతిలో డబ్బులేదు. ఏదైతే అది అయ్యిందిలే అని తనకు ఎంతో ఇష్టమైన బైక్ ను అమ్మేసి డబ్బు సమకూర్చుకున్నాడు. విమానం టికెట్టు, తన ఖర్చులకోసం 20వేల రూపాయలు తప్ప తన దగ్గర ఇంకేమీ లేవు. డబ్బు అయిపోతే అక్కడ జీవితం ఎలా అనే భయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా లండన్ విమానమెక్కాడు. ఆ తెగింపే అతన్ని విజేతగా నిలబెట్టింది.
లండన్ లో తను వెళ్ళిన వెబ్సైట్ డిజైనింగ్ పని ఆరు నెలలలో పూర్తయిపోగానే అక్కడే అతను సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. అతని అదృష్టం బాగుండి వ్యాపారం సక్సెస్ అయ్యింది. దాని తరువాత అతను అభిరుచి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగాఎన్నో వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యాడు. లండన్ మేయర్ రా ఎదిగాడు. భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ధనవంతులలో ఇతనూ ఇప్పుడు పేరు పొందాడు. కష్టపడే తత్వం, నమ్మకం, సామాజిక పరిస్థితులను అంచనా వేసే నేర్పు ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారని రాజేష్ గురించి తెలుసుకున్న వారు అంటున్నారు. నిజమే కదా..
Updated Date - 2023-01-09T11:50:06+05:30 IST