Health Facts: జిమ్‌కు వెళ్లకుండానే కండలు పెంచొచ్చని తెలుసా..? బరువు తగ్గేందుకు ఈ 5 ట్రిక్స్‌ను పాటిస్తే..!
ABN, First Publish Date - 2023-10-03T12:15:59+05:30
అసలు జిమ్ తో పనిలేకుండా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు బరువు తగ్గడం, ఇటు కండలు పెంచడం రెండూ చేయవచ్చు. ఈ కింది 5 ట్రిక్స్ పాటిస్తే..
కండలు తిరిగిన శరీరాకృతి ప్రతి అబ్బాయి కల. జిమ్ ట్రెండ్ పెరిగిన తరువాత వీధికొక జిమ్ సెంటర్ పుట్టుకొచ్చాయి. జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడం అందరికీ ఇష్టం. ఇప్పట్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకేం తీసిపోకుండా జిమ్ కు వెళ్లి శరీర సౌష్టవాన్ని చక్కబెట్టుకుంటున్నారు. జిమ్ లలో కేవలం కండలు పెంచాలనుకునే వారే కాదు, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కూడా ఉంటారు. కానీ అసలు జిమ్ తో పనిలేకుండా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు బరువు తగ్గడం, ఇటు కండలు పెంచడం రెండూ చేయవచ్చు. ఈ కింది 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు..
డాన్స్..(Dance)
డాన్స్ అనేది డాన్సర్లే వేయాలని, అది కొందరికే సాధ్యమని అనుకుంటూ ఉంటారు. కానీ డ్యాన్స్ చేయడం వల్ల అటు బరువు తగ్గడం, ఇటు కండలు పెంచడం రెండూ చేయవచ్చు. ఇవి రెండే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా డ్యాన్స్ చక్కగా సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు రోజూ కొద్జిసేపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తే శరీర సౌష్టవంలో చాలా మార్పు వస్తుంది.
Health Facts: శుభ్రంగా బ్రష్ చేసుకున్నా సరే.. నోట్లో చెడు వాసన పోవడం లేదా..? ఈ 5 చిట్కాలను పాటిస్తే సరి..!
వాకింగ్..(Walking)
అధిక బరువు ఉన్న చాలామంది ఎంచుకునే మొదటి వ్యాయామం వాకింగ్. అయితే ప్రతిరోజూ క్రమం తప్పకుండా 6వేల నుండి 10వేల అడుగులు వేస్తుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కేవలం వాకింగ్ మాత్రమే కాదు రన్నింగ్ కూడా ప్రభావం చూపిస్తుంది. బ్రిస్క్ వాక్ బరువు తగ్గడంలో చాలా బాగా సహకరిస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. కాళ్ల కండరాల నుండి టోటల్ శరీరం అంతా ఒక తీరైన సౌష్టవంలోకి వచ్చేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అయితే పూర్తీ ఫలితాలు పొందడానికి ఓపిక అవసరం.
ఇండోర్ వ్యాయామాలు..(indoor exercise)
ప్రస్తుతం యూట్యూబ్ నుండి బోలెడు ఫిట్నెస్ యాప్స్ వరకు చాలా చోట్ల ఫిట్నెస్ నిపుణులు మంచి వ్యాయామాలు సూచిస్తుంటారు. వీటి సహాయంతో ఇంట్లోనే సులువుగా బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గోల్ పెట్టుకుని వ్యాయామం చేస్తే బరువు తగ్గడంతో పాటు శరీరంలో కండలు కూడా పెంచడం సాధ్యమవుతుంది.
యోగా..(Yoga)
వ్యాయామాలకు విభిన్నంగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చడం యోగాతో సాధ్యం. యోగాలోని వివిధ భంగిమల ద్వారా శరీరంలోని కండరాలు యాక్టివేట్ కావడమే కాకుండా శరీరంలోని పలు ప్రాంతాలలో కొవ్వు కూడా మెల్లగా కరుగుతుంది. యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు బరువు తగ్గడమైనా, కండలు పెంచడమైనా ఏదైనా సాధ్యమే.
డైటింగ్..(Dieting)
వాకింగ్, రన్నింగ్, వ్యాయామాలు, యోగా ఇలా ఎన్ని చేసినా ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే డైటింగ్ ఫాలో కావాలి. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ.. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
Health Facts: మగాళ్లలోనే ఎక్కువగా కనిపించే ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా..? పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందంటే..!
Updated Date - 2023-10-03T12:15:59+05:30 IST