ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: ఈ 8 అలవాట్లలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే మానేయండి.. లేదంటే కాలేయం దెబ్బతినడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-09-14T16:23:26+05:30

కాలేయం దెబ్బతింటే శరీరంలో శుభ్రత ఆగిపోతుంది. దీనికి వంటగదిలో వాడే ఈ పాత్రలు ప్రధాన కారణం అవుతున్నాయి.

మానవ శరీరంలో పనికిరాని అవయమంటూ ఏదీ లేదు. దేని ప్రాముఖ్యత దానికుంది. ఏ అవయం సరిగ్గా పనిచేయకపోయినా, పాడైపోయినా శరీరం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. శరీరంలో చేరే రసాయాలను తొలగించడం, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను ప్రోత్సహించడం చేస్తుంది. కాలేయం దెబ్బతింటే శరీరంలో శుభ్రత ఆగిపోతుంది. దీనికారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.

కాలేయం దెబ్బతింటే(Liver damage) కనిపించే లక్షణాలు..

కామెర్లు, పొత్తికడుపు వాపు, కడుపు నొప్పి, దురద, మూత్రం ముదురు రంగులో ఉండటం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాల ద్వారా కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయం పాడవ్వడానికి రోజువారీ జీవితంలో పాటించే ఎనిమిది అలవాట్లే కారణం అవుతాయి. వాటి గురించి తెలుసుకుని, వాటిని వదిలేయడం ఎంతో అవసరం. అవేంటో తెలుసుకుంటే..

కాలేయం మీద విషం లాంటి ప్రభావం చూపించే అలవాట్లు కొన్ని ఉన్నాయి.

మద్యం సేవించడం

చక్కెరలు అధికంగా తీసుకోవడం

అనారోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం

మందులు ఎక్కువగా వాడటం

ధూమపానం

అల్యూమినియం, టెప్లాన్ పాత్రలలో వంట చేయడం

వ్యాయామానికి దూరంగా ఉండటం

అధిక బరువు

మొదలైన అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది. ముఖ్యంగా అల్యూమినియం, టెప్లాన్ పాత్రలలో వంట చేయడం వల్ల అందులోని రసాయనాలు ఆహారంలోకి చేరుతాయి. ఈ ఆహారం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో టాక్సిన్ లు పెరిగిపోయి కాలేయాన్ని దెబ్బతీస్తాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. అక్కడ ఎలా నిద్రపడుతోందయ్యా సామీ.. పొరపాటున జారి కింద పడితే..!



అధికబరువు ఉన్నవారిలో కాలేయ సంబంధ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా తొందరగా వస్తుంది. ఇది క్రమంగా లివర్ సిర్రోసిస్ గా మారుతుంది.

హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులు కూడా కాలేయం దెబ్బ తినడానికి కారణం అవుతాయి. కాలేయానికి సంబంధించిన ఏ జబ్బు రాకూడదంటే ఎత్తుకు తగిన బరువు మెయింటైన్ చెయ్యాలి. ఆహారంలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా సమతులంగా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. పరిశుభ్రత పాటించాలి. హెపటైటిస్ టీకాలు వేయించుకోవాలి.

Child Health: 18 నెలల వయసు దాటిన పిల్లలు అసలేం తినొచ్చు..? తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా..?


Updated Date - 2023-09-14T16:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising