Health Tips: దనియాల నీటిని ఖాళీ కడుపుతో తాగితే జరిగేదేంటి? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
ABN, First Publish Date - 2023-11-19T16:19:20+05:30
దనియాలు లేదా కొత్తిమీర గింజలు వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు. కానీ దనియాల నీరు ఇలా తాగితే షాకింగ్ ఫలితాలుంటాయి.
దనియాలు లేదా కొత్తిమీర గింజలు వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను కూరల్లో అలంకరణకు, మంచి సువాసస రావడానికి వాడితే వాటి విత్తనాలైన దనియాల పొడిని పలు రకాల వంటల్లో మసాలా తయారీలో తప్పని సరిగా ఉపయోగిస్తారు. అయితే ప్రతిరోజూ దనియాల నీటిని ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. దీని వల్ల కలిగే ఫలితాలేంటో తెలిస్తే షాకవుతారు. అసలు దనియాలలో ఉండే పోషకాలేంటి? వీటిని ఖాళీ కడుపుతో తాగితే జరిగేదేంటి? తెలుసుకుంటే..
కొత్తిమీర గింజలనే దనియాలు(coriander seeds) అని కూడా అంటారు. కొత్తిమీర గింజలలో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె మంచి మొత్తంలో ఉంటాయి. ఈ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఒక స్పూన్ దనియాలను ఒక కప్పు నీటిలో వేసి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. లేదంటే దనియాలను రాత్రి సమయంలో నీటిలో వేసి ఉదయాన్నే కొద్దిగా మరిగించి ఆ తరువాత వడగట్టి తాగాలి. పరగడుపునే ఇలా చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
ఇది కూడా చదవండి: పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని లాభాలో..!
దనియాల నీరు(coriander water) జీర్ణక్రియకు గొప్ప ఔషదం. ఎలాంటి జీర్ణసమస్యలను అయినా ఈ నీరు పరిష్కరిస్తుంది. పరగడుపునే ఈ నీటిని తాగితే జీవక్రియ రేటు మెరుగవుతుంది. రోజంతా ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే దనియాల నీటిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పరగడుపునే ఈ నీరు తాగితే శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. పదే పదే అనారోగ్యం బారిన పడేవారికి ఇది చక్కని పరిష్కారం.
మధుమేహం ఉన్నవారికి కూడా దనియాల నీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా దనియాల నీరు తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు భలే ఫలితాలు ఇస్తుంది. పరగడుపున ఈ నీటిని తాగితే జీవక్రియ మెరుగవుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లను తొలగిస్తుంది. శరీరాన్ని శుద్ది చేస్తుంది. బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
ఇది కూడా చదవండి: Viral Video: మహీంద్రా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిని చూసి అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. అసలెందుకిదంతా? అంటూ ట్వీట్..
Updated Date - 2023-11-19T16:19:21+05:30 IST