Health Tips: కూరల్లో వాడే కరివేపాకును.. ఇలా కూడా వాడొచ్చా..? నీళ్లల్లో వాటిని బాగా మరిగించి రోజూ పొద్దున్నే తాగితే..!
ABN, First Publish Date - 2023-10-09T16:10:28+05:30
ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీరు తాగితే కొన్నిరోజుల్లోనే కనిపించే ఫలితాలు చూసి పక్కాగా షాకవుతారు..
కూరలకు పోపు వేసేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ కూర రుచి, సువాసన మరింత పెరుగుతాయి. ఇది వంటల్లోకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ మైక్రోబయల్ గుణాలు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరచడం నుండి బరువు తగ్గించడం వరకు ఇది చేకూర్చే ప్రయోజనాలకు లెక్కే లేదు. కొన్ని కరివేపాకులను గ్లాసు నీళ్లలో బాగా మరిగించి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల అద్భుతాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. కరివేపాకు నీటిని తాగడం వల్ల కొద్దిరోజుల్లోనే స్పష్టంగా కనిపించే ఆరోగ్య ఫలితాలు ఏంటంటే..
కరివేపాకు నీళ్లను(curry leaf water) ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గుతారు(weight loss). కరివేపాకు నీరు శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది. శరీరాన్ని శుద్ది చేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. తద్వారా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఉదయం లేవగానే కొంతమందికి ఒంట్లో బాలేనట్టుగా అనిపిస్తుంటుంది. దీనిని మార్నింగ్ సిక్ నెస్(Morning sickness) అని అంటారు. జ్వరం వస్తున్నట్టు, ఒళ్లు నొప్పులుగానూ, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వారికి కరివేపాకు నీరు వరమే అని చెప్పవచ్చు. ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీటిని తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ మంత్రించినట్టు మాయం అవుతుంది.
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్.. అస్సలు మిస్ కాకూడని 5 అద్భుతమైన డీల్స్ ఇవే..!
ఈ కాలంలో జుట్టు సంబంధ సమస్యతో(hair problems) లెక్కలేనంత మంది ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలడం తగ్గాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా, జుట్టుకు సంబంధించి ఇతర సమస్యలు పరిష్కారం కావాలన్నా కరివేపాకు నీటిని ఉదయాన్నే తాగాలి. ఇది జుట్టు కుదుళ్లు తేమగా ఉంచుతుంది. జుట్టు బలంగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తాయి. కరివేపాకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులను ప్రోత్సహిస్తుంది.
కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గించడంలో కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో రోజులుగా వేధిస్తున్న మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు కాసిన్ని కరివేపాకులు తిని గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
Curry leaves: కరివేపాకులతో మీకు తెలియని లాభాలెన్నో.. కూరల్లో కాకుండా ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..!
Updated Date - 2023-10-09T16:10:57+05:30 IST