Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు.. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..!
ABN, First Publish Date - 2023-10-26T12:59:23+05:30
ఈ ఆరు ఆహారాలు తీసుకుంటే మాత్రం మెమరీ పవర్ మామూలుగుండదు. 50 ఏళ్లు దాటినా సరే..
'నీకింత మతిమరుపేంట్రా బాబూ..' ఈ మాట జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. ఎవరైనా ఏదైనా చెబితే మర్చిపోవడం, ఏదైనా వస్తువు పెట్టిన చోటు మర్చిపోవడం వంటివి కొందరికి చాలా తరచుగా జరుగుతుంటాయి. అయితే కాలం గడిచేకొద్దీ ఈ సమస్య కూడా ఎక్కువ అవుతుంది. అది చాలా ఇబ్బందికర సమస్యగా మారుతుంది. సాధారణంగా మతిమరుపనేది వయసు పైబడేకొద్ది వచ్చే సమస్య. మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్ లేదా చిత్తవైకల్యం వంటి సమస్యలు వృద్దులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా 50ఏళ్ళు దాటాయంటే చాలు మతిమరుపు సమస్యలు అధికమవుతాయి. కొందరికి చిన్న వయసులో కూడా మతిమరుపు వస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా మతిమరుపు సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. మెదడుకు శక్తిని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచే 6 సూపర్ ఫుడ్స్ ఉన్నాయి(super foods for brain). అవేంటో.. అవెలా మెదడుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే..
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు..(omega-3 fatty acids)
మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చాలాముఖ్యం. ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్, మాకేరెల్, సార్టినెస్ వంటి సముద్రపు ఆహారాలలోనే కాకుండా చియా సీడ్స్, అవిసె గింజలు, సీ వీడ్(దీన్ని సముద్రపు పాచి అని అంటారు), జనపనార విత్తనాలు మొదలైన వాటిలో కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే మెదడు పనితీరు, దాని ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
Health Tips: 30-30-30 రూల్ గురించి విన్నారా? ఫిట్ గా స్లిమ్ గా ఉండేవారి సీక్రెట్ ఇదేనట..
బెర్రీలు..(berries)
చాలా రుచికంగా ఉండే బెర్రీ పండ్లు మెదడుకు మంచి టానిక్ లాంటివి. బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ మొదలైన బెర్రీ పండ్లు తీసుకుంటూ ఉంటే మెదడు పనితీరు బాగుంటుంది. బెర్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరు దెబ్బతినకుండా కాపాడతాయి.
ఆకుపచ్చని ఆకుకూరలు,కూరగాయలు..(green leaf and vegetables)
ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలలో విటమిన్-కె, ఫోలెట్, లుటీన్ వంటివి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. బచ్చలికూర, పాలకూర, మెంతికూర వంటి ఇతర ఆకుకూరలలో మెదడుకు ఆరోగ్యం చేకూర్చే ఖనిజాలు కూడా పష్కలంగా ఉంటాయి. గ్రీన్ క్యాప్సికం, బ్రోకలి వంటి ఆకుపచ్చని కూరగాయలు కూడా మంచివి.
విత్తనాలు, గింజలు..(dry nuts, seeds)
బాదం, వాల్నట్స్, చియా సీడ్స్ మొదలైనవాటిలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు దెబ్బతినకుండా దాన్ని కాపాడటంలో గొప్పగా సహాయపడే యాంటీ ఆక్సిడెంట్. వీటిని రోజూ తింటూంటే మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది.
తృణధాన్యాలు.. (whole grains)
బ్రౌన్ రైస్, ఓట్స్, జొన్న, మొక్కజొన్న, క్వినోవా, గోధుమలు, బార్లీ మొదలైన తృణధాన్యాలలో ఆరోగ్యకరమైన కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మెదడు నిలకడగా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
బ్రోకలీ..(broccoli)
బ్రోకలీ చూడటానికి క్యాలీఫ్లవర్ లా ఆకపచ్చ రంగులో ఉండే కూరగాయ. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-కె, మినరల్స్ తో పాటు ఇతర మినరల్స్ కూడా ఉంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది.
గుమ్మడి గింజలు..(pumpkin seeds)
చాలామంది గుమ్మడి కాయ కోసనప్పుడు అందులో గింజలు పడేస్తుంటారు. కానీ గుమ్మడి గింజలు పోషకాల గని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలలో ప్రతి ఒక్కటి మతిమరుపు, అల్జీమర్స్, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిరాశ, మూర్చ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడాయి.
పై ఆహారాలు తింటూ ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పానీయాలు, శీతలపానీయాలు, కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోవడం ఆపేయాలి. ఇవి మెదడును, జ్ఞాపకశక్తిని దారుణంగా మారుస్తాయి.
Viral Video: కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగడాన్ని ఎక్కడైనా చూశారా..? ఈ కుర్రాడు పెద్ద అద్భుతమే చేసేశాడు..!
Updated Date - 2023-10-26T12:59:23+05:30 IST