Health Tips: ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కొనేయండి.. ఇంతగా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే..
ABN, First Publish Date - 2023-08-27T16:03:43+05:30
వేలాది రూపాయలు పోసినా నయం కాని జబ్బులను ఈ పండు మంత్రమేసినట్టు నయం చేస్తుంది. ఈ పండు ఎక్కడైనా దొరికితే వెంటనే కొనేయమని ఆహార నిపుణులు కూడా చెబుతున్నారు.
పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. కొన్నింటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. మరికొన్నింటిలో పోషకాల కంటే రుచి ఎక్కువ ఉంటుంది. అరటి, మామిడి, బొప్పాయి, పైనాపిల్ ఇలా ఒక్కో పండులో ఒక్కో విధమైన పోషకాలు ఉంటాయి. కానీ ఈ పండ్లను తలదన్నేలా అన్ని పోషకాలు నిండిన పండు ఒకటి ఉంది. దీన్ని తిన్నారంటే అన్ని పండ్ల పోషకాలు శరీరంలో భర్తీ అయినట్టే. వేలాది రూపాయలు పోసినా నయం కాని జబ్బులను ఈ పండు మంత్రమేసినట్టు నయం చేస్తుంది. ఈ పండు ఎక్కడైనా దొరికితే వెంటనే కొనేయమని ఆహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ఆ అద్బుతమైన పండు ఏంటో.. అది నయం చేసే సమస్యలు ఏవో తెలుసుకుంటే..
ఇంగ్లీషులో పాషన్ ప్రూట్(Passion fruit) అని, తెలుగులో తపన ఫలం అని, కృష్ణ ఫలం అని అంటారు. చూడటానికి పసుపు ఊదా రంగులో గట్టిగా ఉన్న ఈ పండు పగులగొడితే లోపల గుజ్జులాగా ఉంటుంది. ఈ గుజ్జును నేరుగా అయినా తినవచ్చు. లేదంటే జ్యూస్, డెజర్ట్, సలాడ్ లలో మిక్స్ చేసుకుని అయినా తినచ్చు. ఈ పండు చాలా అరుదుగా లభిస్తుంది. ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంది. ఇది బ్రెజిల్(Brazil) లో ఎక్కువగా దొరుకుందని, ఇది ఆ ప్రాంతంలోనే పుట్టిందని అంటున్నారు. భారతదేశంలో దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ. అరటి, మామిడి, బొప్పాయి, పైనాపిల్, లిచీ వంటి పండ్లు తినగా లభించే పోషకాలు కేవలం ఒక చిన్న పాషన్ ఫ్రూట్ ద్వారా లభిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..
ఐరన్ లోపం(iron deficiency) ఉన్నవారు దాన్ని భర్తీ చేసుకోవడానికి ఐరన్ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఐరన్ ను శరీరం ఉపయోగించుకోలేదు. దీనికికారణం విటమిన్-సి(vitamin-C) లోపం. అదే పాషన్ ప్రూట్ ను తీసుకోవడం వల్ల విటమిన్-సి, ఐరన్ రెండూ ఏకకాలంలో అందుతాయి. అందుకే ఐరన్ లోపం ఉన్నవారు ఈ పండును తినకుండా వదలొద్దని అంటున్నారు.
పాషన్ ఫ్రూట్ లో విటమిన్-సి తో పాటు బీటా కెరోటిన్, పాలీ ఫెనాల్స్ ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణాలు ఫ్రీరాడికల్స్ కారణంగా దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ పండులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది తక్కువ మొత్తమే అయినా ఊహించని ఫలితాలను ఇస్తుంది. మలబద్దకం, ఫైల్స్ తో బాధపడేవారు, జీర్ణక్రియ సరిగా లేక ఇబ్బంది పడేవారు ఈ పండును తప్పనిసరిగా తినాలి. దెబ్బకు సమస్య అంతా పరిష్కారమవుతుంది.
శరీరంలో మంట, నొప్పిని తగ్గించడానకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న పండ్లు బాగా పనిచేస్తాయి. పాషన్ ఫ్రూట్ లో ఈ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు వేలాది రూపాయలు పోసినా తగ్గని కీళ్లనొప్పులు(joint pains), కీళ్లకు సంబంధించిన రుమాటిజం(rheumatism) అనే సమస్యకు ఈ పండు బాగా ఉపయోగపడుతుంది.
Viral video: ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడొక వ్యక్తి.. ఆ తరువాత జరిందేంటో చూస్తే..
Updated Date - 2023-08-27T16:03:43+05:30 IST