ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: ఈ 4 రకాల విత్తనాలతో ఇంత లాభమా..? రోజూ రాత్రిళ్లు నానబెట్టి.. పొద్దునే పరగడపున తింటే..!

ABN, First Publish Date - 2023-08-07T12:58:08+05:30

కేవలం ఈ నాలుగ రకాల విత్తనాలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటే జరిగే అద్భుతం అంతా ఇంతా కాదు..

ఆరోగ్యం బాగుండాలన్నా, ఆరోగ్యం పాడైపోవాలన్నా ఆహారం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. నేటికాలంలో చాలామంది బయటి ఆహారాలు, బేకరీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. వీటి కారణంగా శరీరంలో కోలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇలా పేరుకుపోయే కోలెస్ట్రాల్ చెడు కోలెస్ట్రాల్ గా పరిగణింపబడుతుంది. ఈ కోలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం అంత ఈజీగా జరిగేపని కాదని అందరూ అనుకుంటారు. కానీ కేవలం ఈ నాలుగ రకాల విత్తనాలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటే చెడు కోలెస్ట్రాల్ అ అనే మాట మీ శరీరానికి వర్తించదు. అసలింతకీ శరీరంలో చెడు కోలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వాడాల్సిన నాలుగు రకాల విత్తనానలేంటి? అవి ఎలా పనిచేస్తాయి? పూర్తీగా తెలుసుకుంటే..

మెంతులు(Fenugreek seeds), పొద్దుతిరుగుడు విత్తనాలు(sunflower seeds), అవిసె గింజలు(flax seeds), బాదం పప్పులు(almonds) వీటిని ప్రతిరోజు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినాలి. వీటిలోకి ఎండుద్రాక్షలు(raisins), ఓట్స్(oats) కూడా జోడించుకోవచ్చు. వీటిని తినడం ద్వారా సిరల్లో పేరుకు పోయిన కోలెస్ట్రాల్ తొలగిపోతుంది(cholesterol in veins). దీనివల్ల గుండె ఆరోగ్యం నుండి మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిని ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలంటే..

Health Tips: రుద్రాక్షలను అందరూ మెడలో ధరిస్తుంటారు.. కానీ ఇలా ఉపయోగిస్తే ఎన్ని లాభాలో..



1టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు విత్తనాలు, 1టేబుల్ స్పూన్ అవిసె గింజలు, 2 బాదం పప్పులు, 4 ఎండు ద్రాక్షలు, 10ఓట్స్. వీటన్నింటినీ రాత్రిపూట నీళ్లలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత ఈ గింజలను మెల్లగా నమిలి తిని, ఆ తరువాత వీటిని నానబెట్టిన నీటిని తాగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తుంటే సిరలలో పేరుకున్న కోలెస్ట్రాల్ క్రమంగా తగ్గిపోతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-B1,B3,B6, మెగ్నీషియం, ఫాస్పర్స్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇక మెంతులలో డైటరీ ఫైబర్, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, స్టెరాయిడల్ సపోనిన్ వంటి అనేక ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలలో ఒమెగా-3ప్యాటీ ఆసిడ్స్, పైబర్, ప్రోటీన్, విటమిన్-B1,B6, మాంగనీస్, మెగ్నీషియం, పాస్పరస్, సెలీనియం, కాపర్, జింక్ మొదలైనివి ఉంటాయి. బాదంలో మంచి కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-E, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ సిరలలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడంలో అత్యుత్తమంగా సహాయపడతాయి.

Health tips: నోటిపుండ్లు వచ్చినప్పుడు తొందరగా తగ్గిపోవాలంటే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి..


Updated Date - 2023-08-07T12:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising