ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: వంటింట్లో ఉండే పెసరపప్పును అంతగా పట్టించుకోరు కానీ.. వీటిని రోజూ నానబెట్టి తింటే జరిగేది ఇదే..

ABN, First Publish Date - 2023-10-10T16:24:03+05:30

రోజూ నానబెట్టిన గుప్పెడు పెసరప్పును తింటుంటే కలిగే లాబాలు చూసి షాకవుతారు..

వంటింట్లో ఉపయోగించే ధ్యానాలు, పప్పులు ఆరోగ్యానికి చాలామంచివి. పప్పు, సాంబార్ కోసం ఎక్కువమంది కందిపప్పును ఉపయోగిస్తారు. ఇక పోపులోకి, పచ్చళ్లకు మినప్పప్పు, శనగపప్పు కూడా ఉపయోగిస్తారు. కానీ పెసరపప్పు వాడకం చాలా తక్కువ. పొంగలి, పాయసం, పెసరపప్పును జోడించి కొన్ని కూరలు చేయడం మినహా వంటింట్లో పెసరపప్పు సందడి తక్కువే. పండుగలు, వ్రతాలలో నైవేద్యానికి తప్ప పెసరపప్పు వాడరు కొందరు. కానీ వంటింట్లో అన్ని పప్పులలోకి పెసరపప్పు ఎంతో శ్రేష్టమని, ఇది పప్పులలో అత్యుత్తమైనదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పెసరపప్పు పోషకాల నిధి అని, వీటిని ముందురోజు నానబెట్టి పచ్చిగా తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. అసలు పెసరపప్పులో ఉన్న ఔషదగుణాలు ఏంటి? ఇవి శరీరానికి కలిగించే లాభాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

పెసరపప్పులో(Moong dal) ఐరన్, పొటాషియం, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా మధుమేహ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కండరాలకు ఎంతో అవసరమైన ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు పెసరపప్పును తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. దీన్ని సూప్ గానూ, పెసరకట్టుగానూ తయారుచేసి అనారోగ్యంతో ఉన్నవారికి ఇస్తుంటే తొందరగా కోలుకుంటారు. చర్మరంగు మెరుగుపరచడంలోనూ మెరిపించడంలోనూ ఇది గొప్పగా పనిచేస్తుంది. శరీరానికి పుష్టిని చేకూరుస్తుంది. శరీరంలో పెరిగిన వాత, పిత్త, కఫ గుణాలను సమతుల్యం చేస్తుంది. కందిపప్పు కంటే తక్కువ వాయువును ఇది విడుదల చేస్తుంది. ఈ కారణంగా పెసరపప్పు శరీరంలో వాతం కలిగించే గుణం తక్కువ. ప్రతిరోజు గుప్పెడు నానబెట్టిన పెసరపప్పును పచ్చిగా తింటూ ఉంటే కండరాల బలహీనత, పోషకాహార లోపంతో ఇబ్బంది పడేవారు వేగంగా శక్తిని పుంజుకుంటారు.

Health Tips: కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఇదేనా.. కేవలం ఇదొక్కటి తాగడం వల్ల అంత మ్యాజిక్కా..


పెసరపప్పు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది. పెసరపప్పును మిక్సీ చేసి పొడిచేసుకుని ఆ పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం క్లియర్ గా మారుతుంది. పెసరపప్పు నానబెట్టిన నీటిని ముఖానికి అప్లై చేసుకుంటే వాడిపోయిన ముఖం తాజాగా మారుతుంది.

Tea: చల్లగా అయిపోయిన తరువాత టీ ని మళ్లీ వేడి చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..


Updated Date - 2023-10-10T16:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising