Health Tips: చల్లగా అయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తుంటారా? పొరపాటున కూడా మళ్లీ వేడి చేయకూడని 5 ఆహారాల లిస్ట్ ఇదీ..
ABN, First Publish Date - 2023-12-03T12:34:25+05:30
అన్నంతో మొదలు ఎన్నో ఆహారాలు వేడి చేసి తింటూంటాం. కానీ ఈ 5 ఆహారాలు మళ్లీ వేడి చేస్తే విషానికి తక్కువేం కాదు..
ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది. చల్లగా అయ్యాక దాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. చలికాలంలో అయితే ఆహారం వండిన తరువాత తొందరగా చల్లగా మారిపోతుంది. చాలా కుటుంబాలు మధ్యాహ్నం వండినదే రాత్రికి కూడా తింటారు. కానీ ఇలా చల్లగా మారిన ఆహారం తినలేక.. ఇటు పడేయడానికి మనసొప్పక చాలా మంది ఆహారం మళ్లీ వేడి చేసుకుని తింటూంటారు. దీని వల్ల ఆహారం వృథా అరికడుతున్నామని, పొదుపు చేస్తున్నామని కూడా అనుకుంటారు. కానీ కింది ఆహారాలను పొరపాటున కూడా మళ్లీ వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల అందులో పోషకాలు దెబ్బ తినడమే కాకుండా ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది.
బంగాళాదుంపలు(potato)
బంగాళాదుంపలను మళ్ళీ వేడిచేయకూడదు. అలా చేస్తే క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. మళ్లీ వేడి చేయడం వల్ల బంగాళాదుంపల్లో ఉండే బి-6, పొటాషియం, విటమిన్-సి విచ్చిన్నం అవుతాయి. అలాంటి బంగాళా దుంప కూరను మళ్లీ తింటే పోషకాలు ఏమీ లభించకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: రోజూ ఎర్ర అరటిపండు తింటే 9 లాభాలు..
పాలకూర(spinach)
పాలకూర సూప్ కానీ, పనీర్ కాంబినేషన్ గ్రేవీ, పప్పు వంటి వంటకాలు తయారుచేసినప్పుడు చల్లగా అయితే దాన్ని పడేయలేక మళ్లీ వేడిచేస్తారు. రుచిగా ఉంటుంది కాబట్టి బాగా తినడానికి ఇష్టపడతారు. కానీ దీన్ని మళ్లీ వేడిచేస్తే నైట్రేట్ లు నైట్రోజినేస్ గా మారతాయి. ఇవి శరీరంలో కణజాలాన్ని దెబ్బతీస్తాయి.
అన్నం(Rice)
చూస్తూ చూస్తూ అన్నం పడేయబుద్ది కాదు. చాలామంది మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్, స్నాక్స్ చేస్తుంటారు. కానీ అన్నాన్ని మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఇందులో పెరుగుతుంది. ఇది పుడ్ పాయిజన్ కు కూడా కారణం అవుతుంది.
మాంసాహారం(Non-veg)
చికెన్, గుడ్లు వంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేసే ఆ తరువాత ఫుడ్ పాయిజనింగ్, జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక ప్రోటీన్ ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. దీన్ని మళ్లీ వేడిచేస్తే చాలా ప్రమాదం.
పుట్టగొడుగులు(Mushrooms)
పుట్టగొడుగులలో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మళ్లీ వేడిచేస్తే ప్రోటీన్లు, ఖనిజాలు విరిగిపోతాయి. అవి విష పదార్థాలుగా రూపాంతరం చెందుతాయి. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.
(గమనిక: ఈ సమాచారం వైద్యులు, ఆహార నిపుణులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
ఇది కూడా చదవండి: Viral Video: వీళ్ల టెక్నాలజీ వాడకం మామూలుగా లేదుగా.. రూ.15కోట్ల కారును 30సెకెన్లలో ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే..
Updated Date - 2023-12-03T12:34:27+05:30 IST