ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: తల్లీ నీకు పాదాభివందనం.. రోడ్డు పక్కన పళ్లు అమ్ముకుంటూ పిల్లలను చదివిస్తున్న మహిళ.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-09-01T11:26:13+05:30

ఈ ప్రపంచంలో ఓ తల్లికి తన బిడ్డలను మించి ఇంకేదీ ఎక్కువ కాదు. ఒక తల్లి తన జీవితం మొత్తాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తుంది. ఇంటిని చూసుకోవడం, వంట చేయడంతో అవసరమైతే భర్తతో పాటు పనికి వెళ్లి డబ్బులు కూడా సంపాదిస్తుంది. ఇన్ని పనులు చేస్తే తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

ఈ ప్రపంచంలో ఓ తల్లికి (Mother) తన బిడ్డలను మించి ఇంకేదీ ఎక్కువ కాదు. ఒక తల్లి తన జీవితం మొత్తాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తుంది. ఇంటిని చూసుకోవడం, వంట చేయడంతో అవసరమైతే భర్తతో పాటు పనికి వెళ్లి డబ్బులు కూడా సంపాదిస్తుంది. ఇన్ని పనులు చేస్తే తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తూ ఎన్నో విషయాలు నేర్పుతుంది. అలాంటి ఓ తల్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని పళ్లు అమ్ముకుంటోంది. అదే సమయంలో పక్కనే తన ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని వాళ్లకు చదువు చెబుతోంది. ఈ వీడియోను జార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ``ఈ వీడియోకు క్యాప్షన్ ఇవ్వడానికి నాకు మాటలు రావడం లేదు`` అని ఆయన చాలా ఎమోషనల్‌గా క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Mother teaching kids at roadside fruit stall).

ఈ వీడియోను ఇప్పటివరకు 1.34 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను 4 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తల్లీ.. నీకు నమస్కారం``, ``పిల్లల విషయంలో తల్లి ఎప్పుడూ రాజీ పడదు``, ``అద్భుతమైన వీడియో``, ``అమ్మ అంటేనే గొప్పది``, ``తల్లీ నీకు పాదాభివందనం`` అంటూ నెటిజన్లు కామెంట్లు

Updated Date - 2023-09-01T11:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising