ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains Effect: అమ్మ బాబోయ్.. వర్షాల ప్రభావం ఈ రేంజ్‌లో ఉందేంటి..? రోడ్డు మీదకు వచ్చిన మొసలి ఏం చేస్తోందంటే..!

ABN, First Publish Date - 2023-07-21T12:31:48+05:30

రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న పాదాచారులకు మొసలి కనిపించింది. ఆ మొసలి చేసిన పని చూస్తే..

ఈ ఏడాది ఇన్నిరోజులూ భానుడి ప్రతాపాన్ని చూసి భయపడ్డాం. మండిపోయే ఎండల మధ్య కష్టంగా అయినా దాన్ని నెట్టుకుంటూ వర్షాకాలంలోకి అడుగు పెట్టాం. ఎండల నుండి కాస్త సేదతీరవచ్చులే అనుకుంటే ఈ వరుణుడు కూడా ప్రజల మీద పగ పట్టినట్టే ఉన్నాడు. దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాల భీభత్సం భయానకంగా ఉంది. ఎక్కడో చెరువుల్లోనూ, సరస్సులలోనూ హాయిగా తన మానాన తాను బ్రతకాల్సిన మొసలి జనావాసాల్లోకి రావడం ఈ వర్షాల భీభత్సానికి తార్కాణంలా నిలుస్తోంది. రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న పాదాచారులకు మొసలి కనిపించింది. ఆ మొసలి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వర్షాకాలం(Monsoon)మొదలయ్యింది మొదలు దేశంలోని పలుప్రాంతాలలో వర్షాలు చాలా భీభత్సంగా ఉన్నాయి(Heavy rains). వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అందరూ మాట్లాడుతుంటారు. కానీ వర్షాల కారణంగా అడవులు, చెరువులు, సరస్సులు అస్తవ్యస్తం అవుతాయి. ఈ కారణంగా వణ్యప్రాణులు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని కోటా(Kota) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డు మీద వెళుతున్న పాదాచారులకు రోడ్డు మీద మొసలి కనిపించింది. రోడ్డు మీద వెళుతున్న వారు వెంటనే ఆ మొసలి ఏం చేస్తుందా అని వీడియో తీశారు. పాపం వర్షాల కారణంగా తన ఆవాసం పోగొట్టుకున్న మొసలి జనావాస ప్రాంతాల్లోకి వచ్చింది. అది రోడ్డు క్రాస్ చేసి(crocodile cross the road)అవతలి వైపు ఉన్న డ్రైనేజీ కాలువలోకి దూకింది. మొసలి రోడ్డు దాటుతున్నంతసేపు అక్కడ రాకపోకలు స్థంభించాయి. ఈ సంఘటనతో కోటా ప్రాంత ప్రజలు షాకయ్యారు. క్రూర జంతువులు జనావాసప్రాంతాలలో తిరగడం పట్ల అభద్రతాభావానికి గురవుతున్నారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలోనే కాకుండా గుజరాత్ రాష్ట్రం గిర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చీకట్లో ఓ మొసలి జనావాస ప్రాంతాలలో తిరుగుతూ కనిపించింది.

Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!


ఈ వీడియోను IFS ఆఫీసర్ Susanta Nanda తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. భారీ వర్షాల కారణంగా మొసళ్ళు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలియజేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇదంతా దేని ప్రభావం? మనుషులు అడవులను నాశనం చేయడం వల్ల, అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'కోటాలో ఇది చాలా సాధారణ విషయం. ఎందుకంటే అక్కడ మొసళ్ళ పార్క్ ఉంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. అది బిర్యానీ దుకాణంకు వెళుతోందని ఒకరు, కోచింగ్ క్లాస్ కు వెళుతోందని మరికొందరు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

Viral Video: ఎంతయినా ఇంజనీర్లు కదా.. మారుతీ కారు టాప్‌ను తీసేసి.. దాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!


Updated Date - 2023-07-21T12:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising