Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..
ABN, First Publish Date - 2023-05-11T12:25:31+05:30
ఆరోగ్యానికి మంచిదిలే అని ఎప్పుడూ వేడినీళ్లు తాగుతుంటారా? దీనివల్ల ఎన్ని సమస్యలొస్తున్నాయంటే..
శరీరానికి నీరు(Water) ఇంధనం వంటిది. నీటిని బాగా తీసుకునేవారి ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈమధ్య కాలంలో పెరిగిన అనారోగ్యాల కారణంగా చాలామంది వేడినీరు(hot water) తాగడం మీద చాలా దృష్టి పెట్టారు. చల్లటి నీళ్లకు బదులు వేడినీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందనడమే ఇందుకు కారణం. వేడినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గొచ్చని(weight loss), గొంతునొప్పి(throat pain), జలుబు-దగ్గు(cough, cold) వంటి సమస్యలు తగ్గించుకోవచ్చని అనుకుంటారు. ఇవన్నీ నిజమే అయినా వేడినీరు తాగడం వల్ల శరీరానికి హాని కూడా జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిదిలే అని ఎప్పుడూ వేడినీళ్లు తాగేవారిలో ఈ సమస్యలు చాపకింద నీరులా చేరుతున్నాయి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? దానివల్ల కలిగే నష్టాలు ఏంటి తెలుసుకుంటే..
వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలు..(hot water side effects)
కిడ్నీలపై ప్రభావం చూపుతుంది..(effect on kidneys)
శరీరంలో టాక్సిన్ లు తొలగించడానికి(remove toxins) మూత్రపిండాలు సహాయపడతాయి. కానీ వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు(dehydration) దారి తీస్తుంది. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. ఈ కారణంగా మూత్రపిండాలు ఎక్కువ శ్రమకు గురవుతాయి. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి.
Viral Video: పాకిస్తాన్ మరీ ఇంత దారుణంగా తయారయ్యిందేంటి? అరటి పళ్ళు అమ్ముకోడానికి ఓ చిన్న పిల్లాడు రహదారిమీదకు వస్తే ప్రజలంతా ఏం చేశారో చూడండి..
నిద్రపై ప్రభావం..(effect on sleep)
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని(drinking hot water before sleeping) నీటిని తాగితే నిద్రలేమి(insomnia) సమస్య ఏర్పడుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగితే మూత్రవిసర్జన పెరుగుతుంది, రక్తనాళ కణాలలో ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య వల్ల అలసటతో పాటు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి
బాడీ డీహైడ్రేట్ అవుతుంది..(body become dehydrate)
మానవశరీరానికి ఆహారం కంటే ఎక్కువ శాతం నీరు అవసరమవుతుంది. కాబట్టి రోజుకు 3నుండి 4లీటర్ల నీరు(3to4 letar's water is required) తప్పనిసరిగా తాగాలని అంటారు. అయితే వేడినేరు తీసుకుంటే అది శరీరాన్ని డీహైడ్రేట్(body dehydrate with hot water) చేస్తుంది, శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇబ్బందులు తలెత్తేలా చేస్తుంది. ఈ కారణంగా వేడినీరు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ కాకపోగా డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది.
Bride: పెళ్ళిరోజు బ్యూటీపార్లర్ కు వెళ్ళి ఎంతసేపైనా తిరిగిరాని వధువు.. కంగారుతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే..
ఎలక్ట్రోలైట్లపై ప్రభావం చూపుతుంది.. (effect on electrolytes)
వేడినీరు రక్తంలోని ఎలక్ట్రోలైట్‌లను కరిగిస్తుంది. వేడీనీరు తాగినప్పుడు అది శరీరంలో జరిపే చర్యలో భాగంగా రక్త కణాలలోకి చేరుతుంది. ఇది కణాల వాపుకు కారణమవుతుంది. ఇది మెదడుపై ఒత్తిడి(effect on brain) పెంచుతుంది. ఈ కారణంగా తలనొప్పి సమస్య అధికమవుతుంది(increase head ache problem). తలనొప్పితో బాధపడేవారు వేడినీరు తాగినా ఉపశమనం ఉండకపోవడానికి కారణమిదే..
Updated Date - 2023-05-11T12:29:06+05:30 IST