ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే.. ఇదేం కండీషన్‌రా బాబూ?

ABN, First Publish Date - 2023-07-22T15:30:39+05:30

బెంగళూరులో ఓ యువకుడు ఉన్నత చదువు అభ్యసించేందుకు వెళ్లాడు. అక్కడ నివసించేందుకు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఎంత తిరిగినా తనకు సరైన ఇల్లు దొరక్కపోవడంతో ఓ బ్రోకర్‌కు మెసేజ్ చేశాడు. ఇంటి ఓనర్ తన ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెట్టాడని.. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రావాలని చెప్పాడని బ్రోకర్ ఇచ్చిన సమాధానంతో సదరు యువకుడు బిత్తరపోయాడు.

మెట్రో నగరాలలో (Metro Cities) ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందరూ ఉద్యోగాలు, బతుకు తెరువు కోసం పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరాలకు వలస (Migration) వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు (Rent) తీసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ పనిచేస్తారు వంటి వివరాలను ఇంటి యజమానులకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ బెంగళూరు(Bangalore)లో ఇల్లు అద్దెకు తీసుకోవాలని భావించిన ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది. దీంతో అతడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా(Social Media)లో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

బెంగళూరులో ఓ యువకుడు ఉన్నత చదువు అభ్యసించేందుకు వెళ్లాడు. అక్కడ నివసించేందుకు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించాడు. దీని కోసం వీధులన్నీ కాళ్లు అరిగేలా తిరిగాడు. టూలెట్ బోర్డులు ఉన్న ఇళ్ల కోసం వెతికి తనకు సౌలభ్యంగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావించాడు. అయితే ఎంత తిరిగినా తనకు సరైన ఇల్లు దొరక్కపోవడంతో ఓ బ్రోకర్‌కు మెసేజ్ చేశాడు. అలా ఓ ఇంటి కోసం వివరాలను అడిగాడు. అయితే ఆ బ్రోకర్ ఇచ్చిన సమాధానంతో సదరు యువకుడు బిత్తరపోయాడు. ఆ ఇంటి ఓనర్ తన ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఓ కండీషన్ పెట్టాడని.. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రావాలని చెప్పాడని.. అంతేకాకుండా ప్రొఫైల్ గురించి 150-200 పదాలలో వివరించి రాయాలని బ్రోకర్ సమాధానం ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: Viral: బాబోయ్.. ఈ పిల్ల నిజంగా గ్రేటే.. నిండా పదేళ్ల వయసు కూడా లేదు కానీ ఇప్పటికే 50 దేశాలు చుట్టేసింది..!

కానీ తనకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు మాత్రమే రావడంతో ఇల్లు ఇవ్వడం కుదరదని యజమాని చెప్పాడని బ్రోకర్ మేసేజ్ చేసినట్లు యువకుడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు బ్రోకర్‌తో చేసిన చాట్‌ను మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువకుడి పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో యోగేష్ అనే వ్యక్తి ఈ పోస్టును షేర్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు. ఎక్కడైనా ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఐడీ కార్డులు, పని చేస్తున్న కంపెనీ వివరాలు అడుగుతారని.. కానీ ఇలా మార్కులు 90 శాతం రావాలని కండిషన్ పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కండిషన్‌లు అసలు ఎందుకు పెడతారని.. మార్కులకు, ఇంటికి సంబంధం ఏంటని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T15:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising