ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paracetamol Tablet: పారాసిటమాల్ మాత్రల్ని వాడే వాళ్లకు తెలియని నిజాలివి.. ఓ వ్యక్తి 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే..!

ABN, First Publish Date - 2023-08-09T16:22:18+05:30

సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటివి తగ్గడానికి ఉపయోగించే పారాసిటమాల్ మాత్రలు మనదేశంలో చాలా ఇళ్లల్లో కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం వచ్చినపుడు డాక్టర్‌ను సంప్రదించకుండా చాలా మంది ఈ మాత్రల్ని వేసుకుంటుంటారు. సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిటమాల్ అద్భుతంగా పని చేస్తుంది.

సాధారణ జ్వరం (Fever), ఒళ్లు నొప్పులు (Body pains), తలనొప్పి (Headache) వంటివి తగ్గడానికి ఉపయోగించే పారాసిటమాల్ (Paracetamol) మాత్రలు మనదేశంలో చాలా ఇళ్లల్లో కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం వచ్చినపుడు డాక్టర్‌ (Doctor)ను సంప్రదించకుండా చాలా మంది ఈ మాత్రల్ని వేసుకుంటుంటారు. సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిటమాల్ అద్భుతంగా పని చేస్తుంది. అయితే పారాసిటమాల్ మాత్రలను ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయి. పారాసెటమాల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys)దెబ్బతింటాయి.

పారాసిటమాల్ మాత్రలు (Paracetamol Tablets) అనేక బ్రాండ్ల పేర్లతో అందుబాటులో ఉన్నాయి. అయితే 60 కిలోల కంటే ఎక్కువ, 30 కిలోల కంటే తక్కువ బరువున్న పిల్లలకు పారాసెటమాల్ ఎంత మోతాదులో ఇవ్వాలో మీకు తెలుసా? వయసు, బరువు ప్రకారం పారాసెటమాల్ డోసు (Paracetamol dosage) లేకపోయినట్టైతే జ్వరం నుంచి కోలుకోవడానికి బదులుగా, మీరు మరింత అనారోగ్యానికి గురవుతారు. డోసు ఎక్కువైత ఈ ఔషధం మీ కాలేయం, మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎవరైనా ఒక రోజులో 4 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో పారాసెటమాల్ తీసుకుంటే, అది ప్రమాదకరం. గర్భిణీ మహిళలు పారాసెటమాల్ వాడితే పిల్లల ఆరోగ్యానికి హానికరం (Health News).

Snake Bite: పాము కరిచిన వెంటనే అంతా తెలియక చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే.. ప్రాణాలే పోతున్నాయ్..!

40 కిలోల కంటే ఎక్కువ వయసున్న 20 ఏళ్లు దాటిన వ్యక్తి 500 ఎంజీ నుంచి 650 ఎంజీ వరకు పారాసెటమాల్‌ను 4 నుంచి 6 గంటల వ్యవధిలో తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు వారి బరువును బట్టి పారాసెటమాల్ ఇస్తారు. ఒక నెల కంటే తక్కువ వయసున్న కుర్రాడికి 10 నుంచి 15 ఎంజీ పారాసెటమాల్ మాత్రమే ఇవ్వాలి. మూడు రోజుల పాటు వేసుకున్నా జ్వరం తగ్గకపోతే ఇక, పారాసెటమాల్ ఆపేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కాలేయం, మూత్రపిండాలు, ఆల్కహాల్ సేవించేవారు, తక్కువ బరువు ఉన్న వారు వైద్య సలహా లేకుండా పారాసెటమాల్‌ను ఉపయోగించకూడదు.

Updated Date - 2023-08-09T16:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising