ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఇదేం ట్రక్కు.. ఇంత పొడవుందేంటి..? రెండు టైర్ల మధ్యలో కూడా ఓ డ్రైవర్..!

ABN, First Publish Date - 2023-09-11T15:16:10+05:30

జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు, లారీలను చూసి ఆశ్చర్యపోతుంటాం. అప్పుడు మరీ భారీ ట్రక్కులను చూసి ఆశ్చర్యపోతుంటాం. అంత భారీ వాహనాలను ఎలా నడుపుతున్నారో అని నివ్వెరపోతుంటాం. ఈ వాహనాలను రివర్స్ చేయడం, యూటర్న్ తీసుకోవడం కూడా చాలా కష్టం.

జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు (Huge Trucks), లారీలను చూస్తుంటాం. ఒక్కోసారి మరీ భారీ ట్రక్కులను చూసి ఆశ్చర్యపోతుంటాం. అంత భారీ వాహనాలను ఎలా నడుపుతున్నారో అని నివ్వెరపోతుంటాం. ఈ వాహనాలను రివర్స్ చేయడం, యూటర్న్ తీసుకోవడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ భారీ ట్రక్కు చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ భారీ ట్రక్కును ఇద్దరు డ్రైవర్లు (Two Drivers) నడుపుతున్నారు.

viralhog అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను అమెరికాలోని కెంటకీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారులో వెళుతూ ఓ ట్రక్కును వీడియో తీశాడు. ఆ ట్రక్కు చాలా పొడవుగా ఉంది. ఒకేసారి ఆ ట్రక్కు మొత్తాన్ని చూడడం చాలా కష్టం. ఆ ట్రక్కుకు రెండో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ డ్రైవర్ ట్రక్కు రెండు చక్రాల మధ్య కూర్చుని స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు.

Viral: ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేసిందో కంపెనీ.. రిప్లై లెటర్‌‌తోపాటు వచ్చిన గిఫ్టును చూసి అవాక్కైన నిరుద్యోగి..!

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది నిజంగా బ్యాక్ సీట్ డ్రైవింగ్``, ``అతడు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు``, ``ఆ డ్రైవర్‌ భద్రత కోసం కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు లేదు``, ``అంత సాహసోపేతమైన పని చేస్తున్న డ్రైవర్‌కు జీతమెంతో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-11T15:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising