ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!

ABN, First Publish Date - 2023-11-15T12:38:03+05:30

రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చెందరని అంటారు. రాజస్థాన్‌లోని దంతారామ్‌గఢ్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ భార్యాభర్తలు తలపడుతుండటమే అందుకు ప్రధాన కారణం.

జైపూర్‌‌‌‌: రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చెందరని అంటారు. రాజస్థాన్‌లోని దంతారామ్‌గఢ్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ భార్యాభర్తలు తలపడుతుండటమే అందుకు ప్రధాన కారణం. దాంతో రాజస్థాన్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్‌‌గఢ్‌ అసెంబ్లీ‌ నియోజకవర్గం (Danta Ramgarh Assembly Constituency) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ్‌‌ సింగ్‌‌ కుమారుడు వీరేంద్ర సింగ్‌‌ (Virendra Singh) ప్రస్తుతం దంతా రామ్‌‌గఢ్‌‌ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన భార్య రీటా చౌధరీ (Rita Chaudhary) కూడా ఇదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌‌ ఆశించి రీటా భంగపడ్డారామె. దీంతో 2023 ఆగస్టులో జననాయక్‌‌ జనతా పార్టీ (Jananayak Janata Party)లో చేరారు. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్‌‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రీటా చౌదరీని జేజేపీ (JJP) ప్రకటించింది. మరోవైపు, కాంగ్రెస్‌‌ (Congress) కూడా వీరేంద్ర సింగ్‌‌కే టికెట్‌‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో భార్యాభర్తలు ప్రత్యర్థులుగా తలపడనున్నారు.

Wife: పుట్టింటికి వెళ్లిన భార్య.. 150 సార్లు కాల్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు డౌట్.. నేరుగా అత్తారింటికి వెళ్తే..!

2018లో కాంగ్రెస్‌ తరఫున దాంతా రామ్‌గఢ్‌ టికెట్‌ ఆశించిన రీటాకు మొండిచేయి చూపి, ఆమె భర్తకు టికెట్‌ ఇచ్చింది అధిష్టానం. దీంతో తీవ్ర నిరాశకు గురైన రీటా గత ఆగస్టులో జేజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆమె పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటాను జేజేపీ ప్రకటించింది. తాజాగా జేజేపీ విడుదల చేసిన ఆరుగురు అభ్యర్ధుల జాబితాలో రీటా పేరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య పోరు తప్పేలా లేదు. ఈ విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? అంటూ పందెంలు కాస్తున్నారట.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో వింత ఘటన.. 82 ఏళ్ల బామ్మ నామినేషన్.. ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

ఇక తనకు జేజేపీ నుంచి దంతా రామ్‌‌గఢ్‌ స్థానానికి ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రీటా చౌదరీ మాట్లాడారు. "నేను నా మనసు మాట వింటాను. ఏది సరైందని అనిపించిందో.. అదే చేశాను. అందుకే జననాయక్‌‌ జనతా పార్టీలో చేరాను. వారు నాకు అండగా నిలిచారు. నియోజకవర్గం ప్రజలు కూడా నన్ను, నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాను. పార్టీ నన్ను దంతా రామ్‌గఢ్ స్థానం నుండి అభ్యర్థిగా ఎంపిక చేసింది. దానికి చాలా సంతోషం. నేను తప్పక విజయం సాధిస్తాను అని నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చారు. కాగా, భర్తతో పోటీపై ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఇంకా నా భర్తకు టికెట్‌ ఖరారు కాలేదు. కాబట్టి ఇప్పుడే దానిపై మాట్లాడటం తొందరపాటు అవుతుందని అన్నారు.

Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!

Updated Date - 2023-11-15T12:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising