ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Husband Built A Temple: ఆమె మీద ప్రేమతో షాజహాన్ అయ్యాడు.. తాజ్ మహల్ కాదు గానీ.. గుడి కట్టేసాడు...!

ABN, First Publish Date - 2023-02-25T10:47:47+05:30

లోకాన్ని విడిచి వెళిపోతే ఇదిగో ఇలా చెట్టుకొమ్మలో మిగిలిపోయిన ఒంటరి పక్షి జీవితం అయిపోతుంది.

Husband Built A Temple
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమించడానికి, ఆరాధించడానికి వయసుతో సంబంధం లేదు. ప్రేమనేది పెళ్ళికి ముందే పుట్టాలనీ లేదు. పెళ్ళయ్యాకా భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకుని ఒకే బాటలో నడిస్తే అది అన్యోన్య దాంపత్యం. మరి ఇందులో ప్రేమ లేదా అంటే ఉంటుంది. ఈ ప్రేమ పెళ్ళిలోకి మారాకా బాధ్యతగా, నమ్మకంగా రూపం మార్చుకుంటుంది. సముద్రమంత ప్రేమగా పుట్టి పాయలుగా విడిపోయి జీవనదిగా స్థిరపడుతుంది ప్రేమ. బిడ్డలు కలిగాకా వారి బాగోగులు చూసుకుంటూ గడిపేస్తారు కాలాన్ని. పిల్లల్ని పెద్దచేసి, రెక్కలొచ్చి ఎగిరిపోయేదాకా చాలా బాధ్యతగా ఉన్న భార్యాభర్తలు అప్పటికి కాస్త రిలాక్స్ అవగానే, ఇక మిగిలింది మనం మాత్రమే, నీకు నేను నాకు నువ్వనుకునే లోపు ఒకరు జారిపోతే, లోకాన్ని విడిచి వెళిపోతే ఇదిగో ఇలా చెట్టుకొమ్మలో మిగిలిపోయిన ఒంటరి పక్షి జీవితం అయిపోతుంది. ఇక్కడ చెప్పుకునేది అలాంటి ఒంటరి ఆరాధకుడి గురించే.. ముందుగానే అనుకున్నట్టు ప్రేమకు వయసుతో పనిలేదు, ఆరాధించడానికి అస్సలు వయసు అడ్డంరాదు.

భార్యంటే అమితమైన ప్రేమ, అంతకంటే గొప్పగా చెప్పాలంటే ఆమంటే ప్రాణం, ఇదంతా పిచ్చిలా తోచినా, ప్రేమగా ఆమె కోసం అతను చేసిన పని ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోయింది. చనిపోయిన భార్య తన ముందే సజీవంగా ఉండాలనే ఆలోచనతో ఆమె గుర్తుగా గుడిని కట్టేసాడు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ గ్రామంలో డభ్బై ఏళ్ళ పళనిస్వామి వ్యవసాయం చేస్తున్నాడు.

పళనిస్వామికి సరస్వతమ్మతో 45 ఏళ్ళ క్రితం వివాహం అయింది. ఇద్దరూ ఆదర్శదంపతులుగా జీవితాన్ని గడిపారు. జనవరి 21, 2019న సరస్వతమ్మ అనారోగ్యంతో మరణించింది. ఒకరుకొకరు ప్రాణంగా మసిలిన భర్య పోవడాన్ని పళనిస్వామి తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. ఆమె జ్ఞాపకాలను మరిచిపోలేక చాలా బాధపడ్డాడు. ఈలోపు తనకో ఆలోచన వచ్చింది. భార్యను ప్రతిమగా చేసి గుడి కడితే తన కళ్ల ముందే ఉన్నట్టుగా ఉంటుందని అదే పని చేశాడు పళనిస్వామి.

సరస్వతమ్మ కోసం గుడి కట్టి మొదటి వర్థంతికి విగ్రహ ప్రతిష్ట చేశాడు. ఆమె విగ్రహాన్ని నిత్యం పూజిస్తూ, శుభ్రం చేస్తూ ఆమెదే లోకంగా బ్రతుకుతున్నాడు. రోజులో రెండు పూటలా దీపారాధన చేస్తూ, ఆరాధిస్తున్నాడు. ఇలాంటి భర్తలు ఎక్కడ లేరని చాలా వార్తల్లో చూసాం అనుకుంటే పొరపాటే.. భార్యను గుండెల్లో పెట్టుకోవడం వేరు ఆమె లేకుండా ఆమె ప్రతిమను గుడిలో పెట్టి ఆరాధించడం వేరు , ప్రేమకు మరో మెట్టు ఈ ప్రేమకథ.

Updated Date - 2023-02-25T10:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising