నా భార్య నుంచి విడాకులతోపాటు.. రూ.36 లక్షల పరిహారం కూడా ఇప్పించండంటూ కోర్టు మెట్లెక్కిన ఓ భర్త కథ ఇదీ..!
ABN, First Publish Date - 2023-01-27T16:20:57+05:30
వారిద్దరికీ 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. గతేడాది ఆగస్టులో భార్యపై గృహ హింస ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం కోర్టులో భర్త దరఖాస్తు దాఖలు చేశాడు. తనకు రూ.36 లక్షల పరిహారం కూడా ఇప్పించాలని వేడుకున్నాడు. తన భార్యకు ఏకంగా 52 మంది వివాహేతర సంబంధాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వారిద్దరికీ 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. 14 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పాడ్డాయి.. గతేడాది ఆగస్టులో భార్యపై గృహ హింస ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం కోర్టులో భర్త దరఖాస్తు దాఖలు చేశాడు. తనకు రూ.36 లక్షల పరిహారం కూడా ఇప్పించాలని వేడుకున్నాడు. తన భార్యకు ఏకంగా 52 మంది వివాహేతర సంబంధాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు (Husband filed a case against wife). ఈ కేసు విచారణ సందర్భంగా గృహహింస చట్టం కింద మహిళను నిందితురాలిగా చేర్చలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఢిల్లీకి (Delhi) చెందిన రాహుల్, సన్యా దంపతులకు ఫిబ్రవరి 2008లో వివాహం జరిగింది. 14 ఏళ్ల తర్వాత సన్యా, రాహుల్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 24 ఆగస్టు 2022న, రాహుల్ తన భార్య నుంచి విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్యకు 52 మందితో వివాహేతర సంబంధాలున్నాయని పేర్కొన్నాడు. సన్యాపై గృహ హింస చట్టం కింద కూడా కేసులు పెట్టించాడు. ఆ తర్వాత సన్యా కూడా భర్తపై కేసు వేసింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించింది. తనకు పరిహారంగా రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కోర్టు నుంచి సమన్లు రావడంతో రాహుల్ దానిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. ఈ పిటీషన్‌ను ఢిల్లీ న్యాయమూర్తి కొట్టేశారు.
మహిళల రక్షణ కోసం 2005లో రూపొందిచిన చట్టాన్ని గృహ హింస (Domestic Violence) చట్టం లేదా మహిళల రక్షణ చట్టం 2005 అని పిలుస్తారు. ఈ చట్టం ప్రకారం భార్యను భర్త కొట్టడం, అవమానించడం, అతని కుటుంబం సదరు మహిళను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా హింసించడం కూడా గృహ హింస కిందకే వస్తుంది. ఈ చట్టం ప్రకారం మహిళను బాధితురాలిగా మాత్రమే పరిగణిస్తారు. ఆమె నిందితురాలు కాదు. అయితే భార్య చేతిలో వేదింపులకు గురయ్యే భర్తలు రెండు సెక్షన్ల కింద కేసులు పెట్టవచ్చు. మొదటిది విడాకుల కోసం కేసు వేయడం. రెండోవది.. భార్య వేరెవరితోనైనా సన్నిహితంగా ఉన్నా, వేరే వారితో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నా భర్త.. IPC సెక్షన్ 506, IPC సెక్షన్ 323, IPC సెక్షన్ 294 కింద కేసులు నమోదు చేయవచ్చు.
Updated Date - 2023-01-27T16:21:00+05:30 IST